Microsoft లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్.. ChatGPT విడుదలలో కీలక పాత్ర..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత ChatGPT విడుదలలో కీలకపాత్ర పోషించిన ఓపెన్ ఏఐ సీఈవోగా ఉన్న శామ్ ఆల్ట్‌మాన్‌ను (Sam Altman) గత వారం సంస్థ తొలగించింది. ఈ పరిణామం టెక్ ప్రపంచంలో కీలక చర్చకు దారితీసింది. దీనిపై ప్రకటన సందర్భంగా ఓపెన్ ఏఐ సంస్థ కీలక ప్రకటన చేసింది.
శామ్ ఆల్ట్‌మాన్ అంతర్గత చర్చల్లో నిజాయితీగా లేరని, బోర్డుకు సరైన సమాచారం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది. బోర్డు తీసుకొనే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని, శామ్ పనితీరుపై బోర్డుకు విశ్వాసం లేదని వెల్లడించింది. అయితే వారాంతంలో ఓపెన్ ఏఐ సంస్థలోకి ఆల్ట్‌మాన్ రీఎంట్రీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) కీలక ప్రకటన చేశారు. ఓపెన్ ఏఐ మాజీ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మాన్‌లు మైక్రోసాఫ్ట్‌లోని అడ్వాన్స్‌డ్ ఏఐ పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. ఈ మేరకు X (ట్విట్టర్)లో కీలక ప్రకటన చేశారు.
'ఈ వార్తను పంచుకోడానికి చాలా సంతోషిస్తున్నాను. శామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మాన్ మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ బృందానికి నాయకత్వం వహిస్తారు. వారి విజయానికి అవసరమైన వనరులను అందించడానికి సిద్దంగా ఉన్నాం' అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాంతోపాటు మరో కీలక ప్రకటన చేశారు. ఓపెన్ ఏఐ సంస్థతో తమ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ఓపెన్ ఏఐ తాత్కాలిక సీఈవోగా నియామకం అయిన మాజీ Twitch సీఈవో ఎమ్మెట్ షియర్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని సత్య నాదెళ్ల తెలిపారు. ఓపెన్ ఏఐ సంస్థలో మైక్రోసాఫ్ట్ $10 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది.
ఓపెన్ ఏఐ సంస్థ నుంచి తొలగింపు అనంతరం శామ్ ఆల్ట్‌మాన్ X (ట్విట్టర్) వేదికగా కీలక ప్రకటన చేశారు. ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేయడాన్ని తాజా ఎంతో ఇష్టపడినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఉపయోగపడిందని చెప్పారు. ఎంతో మంది ప్రతిభావంతులతో పనిచేసినట్లు శ్యామ్ ఆల్టమన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఓపెన్ ఏఐ సీఈవోగా వ్యవహరించిన శ్యామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించిన గంటల వ్యవధిలోనే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ఆల్ట్‌మాన్‌ను తొలగించిన కారణంగానే తాను కూడా సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొ్న్నారు. తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని బ్రోక్‌మన్ వెల్లడించారు. అసాధ్యమనుకున్నవి సాధించి చూపించామని.. అద్భుతాలను సృష్టించామని, వాటి పట్ల సంతోషంగా ఉన్నామని పోస్ట్ చేశారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








