Home
News

మైక్రోసాఫ్ట్‌ 365 సర్వీసుల్లో సమస్యలు.. రెండు వారాల్లోనే రెండోసారి సాంకేతిక సమస్య..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మైక్రోసాఫ్ట్‌ 365 సర్వీస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు (Microsoft hit by second outage) అనేక మంది సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జులై 30 సాయంత్రం సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు తమ సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. జులై 19 న కూడా ఈ సమస్య తలెత్తింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది.

ముఖ్యంగా విమాన సర్వీసులు రద్దు మరియు ఆలస్యంగా ప్రయాణించాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించిన కొన్ని రోజుల అనంతరం మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది. ఇదే తరహా సాంకేతిక సమస్య భవిష్యత్‌లోనూ ఎదురుకావచ్చని హెచ్చరించింది. ఇందుకు యూరోపియన్‌ కమిషన్‌ రూపొందించిన కొన్ని నిబంధనలు కారణమని ఆరోపించింది.

Microsoft hit by second global outage

ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. ఈ సమస్యపై X వేదికగా azure Support స్పందించింది. వినియోగదారుల సహనానికి ధన్యవాదాలు తెలిపింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, వీలైనంత వేగంగా చక్కదిద్దుతామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్‌ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యపై తమకు అవగాహన ఉందని, పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు 365 స్టాటస్‌ అకౌంట్‌ కూడా వెల్లడించింది. Downdetector లో అవుట్‌లుక్‌ సహా ఇతర అప్లికేషన్‌లకు సంబంధించిన సమస్యలపై అనేక మంది యూజర్లు ఫిర్యాదు నేపథ్యంలో సంస్థ ఈ అంతరాయన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్‌లో ఈనెల 19న తలెత్తిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా కంప్యూటర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సమస్యను బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ ఎర్రర్‌గా (BSOD) పేరొన్నారు. Crowdstrike లో అప్‌డేట్‌ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అదే రోజు మైక్రోసాఫ్ట్‌ ఈ సమస్యను పరిష్కరించింది.

మైక్రోసాఫ్ట్‌లో ఇటీవల తలెత్తిన అంతరాయం కారణంగా సుమారుగా రోజంతా అనేక సంస్థలు తమ కార్యకాలాపాలను నిర్వహించలేకపోయాయి. అనేక విమానాల రద్దు సహా ఆలస్యంగా ప్రయాణాలను ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై అనేక మంది సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. క్రౌడ్‌ స్ట్రైక్‌ సంస్థ మాత్రం దీనిపై వివరణ ఇచ్చింది. విండోస్‌లో కేవలం సాంకేతిక అంతరాయం మాత్రమే తలెత్తిందని.. ఎటువంటి భద్రతా మరియు సైబర్‌ అటాక్‌ కాదని స్పష్టంచేసింది.

మైక్రోసాఫ్ట్‌ గతవారం మరో కీలక ప్రకటన చేసింది. భవిష్యత్‌లో మరోసారి క్రౌడ్‌స్ట్రైక్‌ తరహా అంతరాయం తలెత్తే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకుండా నిరోధించే అవకాశం లేదని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. థర్డ్ పార్టీ విక్రేతలకు కూడా OS కెర్నల్‌ వెర్షన్‌ పూర్తి యాక్సెస్‌ను పొందేలా కొత్త నిబంధనను యూరోపియన్‌ కమిషన్‌ తీసుకొచ్చింది.

అంటే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లకు ఉండే స్థాయిలోనే క్రౌడ్‌ స్ట్రైక్‌ వంటి థర్డ్‌ పార్టీ సంస్థల ఇంజినీర్లకు పూర్తి యాక్సెస్‌ ఉంటుంది. దీంతో భవిష్యత్‌లోనూ సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతలోనే రెండు వారాల్లోనే రెండోసారి సాంకేతిక సమస్య తలెత్తింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Microsoft hit by second global outage days after crowdstrike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X