ఒప్పందం వెనుక..?

Posted By: Super

ఒప్పందం వెనుక..?

 

దేశంలో సాంకేతిక విద్యను మరింత మెరుగుపరిచేందుకు  అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)  చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను వినియోగించుకునేందుకు  ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే మూడు నెలల్లో 10,000కు పైగా సాంకేతిక కళాశాలలు, సంస్థల్లో మైక్రోసాఫ్ట్ లైవ్ ఎట్ ఎడ్యూ (Live@edu)సర్వీసులను ఉపయోగించనున్నారు.

ఈమెయిల్, మైక్రోసాఫ్ట్ వెబ్ అప్లికేషన్స్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, స్టోరేజి తదితర సదుపాయాలు ఇందులో లభిస్తాయి. సుమారు 70 లక్షల మంది దాకా విద్యార్థులకు, 5 లక్షల మంది ఫ్యాకల్టీ సభ్యులకు ఇది ఉపయోగపడనుంది. దీని వల్ల విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించడం సాధ్యపడుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. సాంకేతిక విద్యను పెంపొందించే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం మరింత ముందుకెళ్లాలని ఆశిద్దాం.

విండోస్ ఎక్స్‌పీ మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుందా..?

గత కొద్ది సంవత్సరాల కాలంగా కంప్యూటింగ్ ప్రపంచానికి విశిష్టసేవలందిస్తున్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఎక్స్‌పీ మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుంది. నివ్వెరపాటకు‌లోను చేసే ఈ వార్తను యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ బ్లాగ్ ప్రచురించింది. నవీకరణ నేపధ్యంలో ఈ నిర్ణయం అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌పీకి అప్‌డేటెడ్ వర్షన్‌లుగా విండోస్ 7, విండోస్ విస్టాలు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో ఏప్రిల్ 8, 2014, నాటికి విండోస్ ఎక్స్‌పీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003ల సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం పై మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ స్టెల్లా చెర్నాయక్ స్పందిస్తూ

ఎక్సీ‌పీ యూజర్లు నిర్ణీత సమయం లోపే విండోస్ 7 లేదా విస్టాకు మైగ్రేట్ కావాలని సూచించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot