విండోస్ 7 యూజర్ల కోసం ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ 10 ప్రివ్యూ విడుదల!

By Prashanth
|
Internet Explorer 10 Preview Released for Windows 7 Users


విండోస్ 7 యూజర్ల కోసం ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ (ఐఈ) 10 బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ సరికొత్త ఐఈ 10బ్రౌజర్ పాత బ్రౌజర్ వర్షన్‌లతో పోలిస్తే మెరుగైన బ్రౌజింగ్ అనుభూతులను చేరువచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లచే ఉత్తమమైన కంప్యూటింగ్ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న విండోస్ 7 వినియోగం విషయంలో ఇటీవలే విండోస్ ఎక్ప్‌పీ‌ని అధిగమించింది. ఈ సరికొత్త బ్రౌజర్‌ను విండోస్ 8 ఆవిష్కరణ సమయంలో అధికారికంగా ప్రకటించారు. కొత్త వర్షన్ ఐఈ10 బ్రౌజర్ విండోస్7 ఇంకా విండోస్‌8లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 2009లో విడుదలైన విండోస్7.. ప్రపంచవ్యాప్తంగా 670మిలియన్ల లైనెన్సులను పొందినట్లు మైక్రోసాఫ్ట్ నివేదికలు వెల్లడించాయి. విండోస్ 8 ఈ లైసెన్సుల సంఖ్యను అధిగమించటానికి 2014వరకు సమయం పడుతుందని సదరు నివేదికలు అంచనా వేస్తున్నాయి. విండోస్ 8 ఆధారితంగా స్పందించే లెటెస్ట్ వర్సన్ ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్‌లలో ఐఈ 10బ్రౌజర్‌ను ముందుగానే లోడ్ చేయటం జరిగింది. విండోస్ 7 యూజర్లు ఐఈ 10బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తదుపరి చర్యగా ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

విండోస్ ఫోన్ 8 ఆధారితంగా స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు….

లూమియా 920:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

లూమియా 820:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, క్లియర్ బ్లాక్ టెక్నాలజీ, రిసల్యూషన్ 480 × 800పిక్సల్స్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్ ప్రాసెసర్), 1జీబి ర్యామ్, 8.7 మెగా పిక్సల్ కెమరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, రెడ్, ఎల్లో, గ్రే, సియాన్, పర్పిల్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, 8జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వైర్‌లెస్ ఛార్జింగ్, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్.

హెచ్‌టీసీ 8ఎక్స్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, హెచ్‌టీసీ ఇమేజ్ చిప్ టెక్నాలజీ, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సామర్ధ్యం, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ 802.11 Wi-Fi a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్ గేమ్స్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ ఏటీఐవీఎస్ విండోస్ ఫోన్ 8:

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్, 8.7మిల్లీమీటర్ల మందం, 1.5గిగాహెర్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఫోన్ మెమెరీ 16జీబి, 32జీబి, స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్ డిస్‌ప్లే, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X