‘చైల్డ్ అబ్యూజ్’ పై మైక్రోసాఫ్ట్ కొరడా!

|

చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం) చట్ట వ్యతిరేకమని సూచిస్తూ ఇంటర్నెట్ యూజర్‌లలో చైతన్యాన్ని రగిల్చే కమ్రంలో సాఫ్ట్‌‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజన్‌కు సంబంధించి పాప్-అప్వార్నింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 
‘చైల్డ్ అబ్యూజ్’ పై మైక్రోసాఫ్ట్ కొరడా!

బింగ్ యూజర్లు ఈ సరికొత్త బింగ్ నోటిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌ను బ్రౌజర్‌లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం) కంటెంట్‌ను సెర్చ్ చేసే సమయంలో వార్నింగ్‌తో కూడిన ఆన్-స్ర్కీన్ నోటిఫికేషన్ తెర పై ప్రత్యక్షమవటంతో పాటు Stopitnow.org (Stopitnow.org) అనే లింకు దూరిచూపుతుంది. ఈ లింక్ చైల్డ్ అబ్యూజ్ చట్ట వ్యతిరేకమని సూచించటంతో పాటు ఆయా అంశాల పట్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన పాలసీ ప్రకారం త్వరలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు సంబంధించిన లింక్‌లను తొలగించనుంది.

లైంగిక దాడుల నుంచి రక్షించే ‘జీపీఎస్ లోదుస్తు'

ఇటీవల కాలంలో మహిళల పై పెరుగుతున్న లైంగిక దాడుల పై స్పందించిన చెన్నైకి చెందిన ముగ్గురు ఆటోమొబైల్ ఇంజనీర్లు మహిళలను లైంగిక దాడుల నుంచి రక్షించే ప్రత్యేకమైన లోదుస్తులను రూపొందించారు. జీపీఎస్ మాడ్యుల్స్‌తో రూపుదద్దుకున్న ఈ లోదుస్తులను మహిళలు ధరించినట్లయితే విపత్కర పరిస్థితులలో సంబంధిత హెచ్చరికా సంకేతాలు బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా పోలీసులకు పంపబడుతాయని రూపకర్తలు అంటున్నారు.

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన ఉపకరణాలతో పాటు, షాక్ తరంగాలను విడుదల చేసే ప్రెజర్ సెన్సర్లను ఈ దుస్తులో అమర్చారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘షి' (సొసైటీ హార్నెసింగ్ ఎక్విప్‌మెంట్ - ఎస్‌హెచ్‌ఈ) గా పిలుస్తున్నారు. బస్సులు, బహిరంగా ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే మహిళలకు ఇదెంతో ఉపయుక్తమని ఈ పరికరాన్ని రూపొందించిన మనీషా మోహన్ తెలిపారు. ఒక బాలిక పై లైంగిక దాడి పాల్పడటానికి యత్నించినపుడు ప్రెజర్ సెన్సర్ అప్రమత్తమై సదరు వ్యక్తికి వెంటనేన షాక్ కొట్టేలా చేస్తుందని మనీషా తెలిపారు. అమర్చిన జీపీఎస్, జీఎస్ఎం వ్యవస్థలు ప్రమాద సంకేతాలను పోలీసుల అత్యవసర నెంబరు 100కు ఇంకా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లకు సందేశాల రూపంలో చేరవేస్తాయి. లైంగిక దాడుల నుంచి రక్షించే ‘జీపీఎస్ లోదుస్తు' చెన్నైలోని శ్రీ రామస్వామి స్మారక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న మనీషా తన సహవిద్యార్థులైన రింపి త్రిపాఠి, నీలాద్రి బసుపాల్‌తో కలిసి ‘షి' పరికారాన్ని డిజైన్ చేసారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X