ఇండియా కంపెనీ లో మైక్రోసాఫ్ట్ 100 మిలియన్ల పెట్టుబడులు!!! ఎందులోనో తెలుసా??

|

ప్రముఖ సాఫ్ట్‌వేర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద వివిధ సంస్థలలో పెట్టుబడులను అధికంగా పెడుతున్నది. ఇందులో భాగంగా ప్రముఖ భారతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్‌లో సుమారు 100 మిలియన్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేయడం కోసం చర్చలు జరుపుతున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చినట్లయితే మైక్రోసాఫ్ట్ పెట్టుబడి కారణంగా షేర్‌చాట్ తన తాజా నిధుల రౌండ్‌లో సేకరించాలని చూస్తున్న మొత్తం నిధుల రౌండ్‌లో మూడో వంతు ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి.

 

మైక్రోసాఫ్ట్ - షేర్‌చాట్ ఒప్పందం

మైక్రోసాఫ్ట్ - షేర్‌చాట్ ఒప్పందం

షేర్‌చాట్ ప్రస్తుతం కొత్త వారితో ఒప్పందాలను చేసుకోవడానికి ముందుగా తన యొక్క ప్రస్తుత పెట్టుబడిదారుల నుండి తమకు కావలసిన నిధులను సేకరించే అవకాశం అధికంగా ఉందని మరో కొన్ని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త ఒప్పందం ముగియడానికి మరికొన్ని కొన్ని నెలలు పట్టవచ్చు. ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రారంభ దశలో మాత్రమే ఉన్నాయని కొన్ని నిఘా వర్గాలు తెలిపాయి.

మైక్రోసాఫ్ట్ ఇతర ఒప్పందాలు

మైక్రోసాఫ్ట్ ఇతర ఒప్పందాలు

మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం యుఎస్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలను మరియు ప్రముఖ చైనా కంపెనీ అయిన బైట్‌డాన్స్ నుండి మరికొన్ని మార్కెట్ షేర్ లను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. దీనితో పాటుగా టిక్‌టాక్ యొక్క ఇండియా మార్కెట్ మరియు యూరోపియన్ మార్కెట్‌ను సొంతం చేసుకోవటానికి మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

మైక్రోసాఫ్ట్ - టిక్‌టాక్ ఒప్పందం
 

మైక్రోసాఫ్ట్ - టిక్‌టాక్ ఒప్పందం

యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలలో టిక్ టాక్ యొక్క కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు ధృవీకరించాయి. అలాగే భారతీయ మరియు యూరోపియన్ మార్కెట్ల మీద కూడా చాలా ఎక్కువ ఆశక్తిగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి.  ఇండియా యొక్క మార్కెట్ లో టిక్‌టాక్ తో మైక్రోసాఫ్ట్ యొక్క ఒప్పందం పని చేయకపోతే కనుక బైట్‌డాన్స్ ఇండియా వ్యాపారాన్ని ఇతర విదేశీ పెట్టుబడిదారులకు లేదా భారతీయ కొనుగోలుదారులకు విక్రయించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

షేర్‌చాట్ vs టిక్‌టాక్

షేర్‌చాట్ vs టిక్‌టాక్

టిక్‌టాక్ / బైట్‌డాన్స్‌తో మైక్రోసాఫ్ట్ సంస్థ చర్చలు ఇంకా కొనసాగుతున్న సమయంలోనే షేర్‌చాట్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెట్టడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో షేర్‌చాట్‌కు టిక్‌టాక్ ప్రత్యర్థిగా కూడా ఉంది. ఇండియాలో టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన కొద్ది రోజులకే షేర్‌చాట్ Moj అనే వీడియో షేరింగ్ సర్వీస్ ను ప్రారంభించారు. బైట్‌డాన్స్ యొక్క హలో యాప్ తో కూడా షేర్‌చాట్‌తో పోటీపడుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ మరియు షేర్‌చాట్ సంస్థలు రెండూ కూడా దీనిపై ఇంకా ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు.

Best Mobiles in India

Read more about:
English summary
Microsoft Invests 100 million in Indian Company!! Do You Know Which One?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X