మైక్రోసాఫ్ట్ డబ్బులిస్తోంది, ఎందుకు తెలుసా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, గతేడాది నిర్వహించిన మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా Edge Browserను ఉపయోగించుకున్న అమెరికన్ యూజర్లకు నగదు చెల్లించిన విషయం తెలిసిందే. ఇటీవల తన మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను బింగ్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌గా మార్చిన మైక్రోసాఫ్ట్, Bing Searchను ఉపయోగించుకునే యూజర్లకు పాయింట్లను ఇస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్కో పాయింట్‌కు ఒక్కో పౌండ్

Bing Searchను వాడి 3 పాయింట్లను గెలుచుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఒక్కో పాయింట్‌కు ఒక్కో పౌండ్ లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ నిర్వహించే అనేక క్విజ్ పోటీల్లో పాల్గొన్నట్లయితే మరిన్ని పాయింట్లను గెలుచుకునే వీలుంటుంది.

రోజుకు 30 పాయింట్లను గెలుచుకునే అవకాశం

మైక్రోసాఫ్ట్ చెబుతోన్న దాని ప్రకారం బింగ్ సెర్చ్‌ను వినియోగించుకోవటం ద్వారా ఒక్కో యూజర్ రోజుకు 30 పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీరు Edge Browserను ఉపయోగించు కుంటున్నట్లయితే పాయింట్ల సంఖ్యను 60 పాయింట్ల వరకు పెంచుకునే వీలుంటుది.

పాయింట్ల ద్వారా లభించే గిఫ్ట్స్...

ఈ పాయింట్ల ద్వారా యూజర్లకు ఎక్స్‌బాక్స్ గిఫ్ట్ కార్డ్స్, ఫ్రీ మూవీస్, స్కైప్ క్రెడిట్స్, గ్రూవ్ మ్యూజిక్ పాసెస్ వంటివి లభిస్తుంటాయి. బింగ్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌‌లో యూజర్ సెకండ్ లెవల్‌కు చేరుకోవాలంటే నెలకు 500 పాయింట్లను సంపాదించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే..

ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్ ను త్వరలోనే కెనడా, జర్మనీ ఇంకా ఫ్రాన్స్ దేశాల్లో లాంచ్ చేయనున్నారు.

మైక్రోసాఫ్ట్ బాటలోనే గూగుల్

గూగుల్ ఎట్టకేలకు తన 'గూగుల్ ఓపీనియన్ రివార్డ్స్' (Google Opinion Rewards) యాప్‌ను ఇండియాలో విడుదల చేసింది. గూగుల్ సర్వేస్ టీమ్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండియాతో పాటు సింగపూర్ ఇంకా టర్కీ దేశాల్లో ఒపీనియన్ రివార్డ్స్ యాప్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ ప్లే క్రెడిట్

ఈ యాప్‌లో నిర్వహించే క్విక్ సర్వేలకు సమాధానాలు చెప్పటం ద్వారా యూజర్‌కు గూగుల్ ప్లే క్రెడిట్ లభిస్తుంది. ఈ క్రెడిట్‌ను ప్లే స్టోర్‌లోని యాప్స్‌తో పాటు గేమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.

రోజుకో సర్వేను గూగుల్ మీకు పంపుతుంది

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే మీ పేరు, వయసు, జెండర్ వంటి బేసిక్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ విజయవంతంగా లాంచ్ అయిన తరువాత రోజుకో సర్వేను గూగుల్ మీకు పంపుతుంది.

రూ.64 క్రెడిట్ మీ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది

కొత్త సర్వే వచ్చిన వెంటనే మీకో నోటిఫికేషన్ వస్తుంది. ఆ సర్వేను విజయవంతంగా మీరు పూర్తి చేసినట్లయితే రూ.64 క్రెడిట్ మీ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఈ క్రెడిట్ తో మీకు నచ్చిన యాప్స్‌తో పాటు గేమ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Microsoft Is Paying You To Use Bing Search!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot