నిలిచిపోనున్న ‘Internet Explorer’

By Sivanjaneyulu
|

మైక్రోసాఫ్ట్ తన Internet Explorerకు స్వస్తి పలకబోతోంది. ఎక్స్‌ప్లోరర్ 8,9,10 వర్షన్‌లకు టెక్నికల్ ఇంకా సెక్యూరిటీ సపోర్ట్‌లను జనవరి 12 నుంచి మైక్రోసాప్ట్ నిలిపవేయబోతోంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

నిలిచిపోనున్న ‘Internet Explorer’

ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ వర్షన్స్ కోసం మైక్రోసాఫ్ట్ చివరిసారిగా విడుదల చేసిన పాచ్ ఆఖరి బగ్ ఫిక్సులతో పాటు "End of Life" పేరుతో ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ బ్రౌజర్ వర్షన్‌లకు టెక్ సపోర్ట్ నిలిచిపోబోతున్న నేపథ్యంలో విండోస్ యూజర్లు ఎక్స్‌ప్లోరర్ 11 లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లకు అప్‌డేట్ కావల్సి ఉంది.

Trending Article: సంక్రాంతి బరిలో 20 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌లు

1984 నుంచి 2015 వరకు మైక్రోసాఫ్ట్ విండోస్ వివిధ వర్షన్‌లలో కంప్యూటింగ్ ప్రపంచానికి చేరువైన వైనాన్ని క్రింది స్లైడర్‌‍లో చూడొచ్చు...

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ తన మొదటి వర్షన్‌ను నవంబర్ 1985లో విడుదల చేసింది. విండోస్ వర్షన్ 1.0 అలానే 2.xలు MS-DOSకు గ్రాఫికల్ ఎక్స్‌టెన్షన్‌లుగా వచ్చాయి.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

మైక్రోసాఫ్ట్ విండోస్ కంట్రోల్ ప్యానల్ మొదటి సారిగా విండోస్ 2.0లో కనిపిచ్చింది. అయితే ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలు మార్కెట్లో ఆకట్టుకోలేకపోయాయి.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

ఆ తరువాత మైక్రోసాఫ్ట్ నుంచి విడుదలైన విండోస్ 3.0 "TrueType scalable fonts"ను సపోర్ట్ చేయటం ప్రారంభించింది. ఈ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చిన తరువాత మల్టీమీడియా అలానే నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల వినియోగం మరింతగా పెరిగింది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

1995, ఆగష్టులో మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లో 10 లక్షల విండోస్ 95 కాపీలు అమ్ముడుపోవడం విశేషం. ఈ అమ్మకాల సంఖ్య 5 వారాల్లో 70 లక్షలకు పెరిగిపోయింది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ 95 విజయవంతమైన తరువాత మైక్రోసాఫ్ట్ రెట్టింపు ఉత్సాహంతో విండోస్ 98ను జూన్ 1998లో విడుదల చేసింది. ఈ ఓఎస్ వర్షన్ యూఎస్బీ డివైజ్ అలానే డీవీడీ రైటర్‌ను సపోర్ట్ చేసింది. అలానే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ఈ ఓఎస్‌లో పొందుపరిచారు.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

మైక్రోసాఫ్ట్ తన విండోస్ 2000 వర్షన్‌ను 2000లో విడుదల చేసింది. ఎన్టీ 5 పేరుతో ఈ ఓఎస్‌‌ను మార్కెట్ చేసింది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

మైక్రోసాఫ్ట్ తన విండోస్ మిలీనియమ్ ఎడిషన్‌ను జూన్ 2000లో విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంలో అనేకమైన మల్టీమీడియా, హోమ్ నెట్‌వర్కింగ్ ఆప్షన్‌లను మైక్రోసాప్ట్ పొందుపరిచింది. ఈ ఓఎస్ ద్వారా మీడియా ప్లేయర్ 7, మూవీ మేకర్, ఆడియో వీడియో ప్లేయర్, మూవీ క్రియేషన్ ప్రోగ్రామ్ వంటి కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ ప్రపంచానికి పరిచయం చేసింది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంలలో ఒకటైన Window XPని మైక్రోసాఫ్ట్ 2001 అక్టోబర్ లో విడదుల చేసింది. పర్సనల్ అలానే బిజినెస్ వర్షన్ లలో ఈ ఓఎస్ విడుదలైంది. రిమోట్ డెస్క్‌టాప్ సర్వీస్, పైల్ సిస్టం ఎన్‌క్రిప్షన్, వైర్‌లెస్ డివైస్ సపోర్ట్, నెట్‌వర్క్ అండ్ రిమోట్ అసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలను ఈ ఆపరేటింగ్ సిస్టంలో పొందుపరిచారు.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

2006లో విండోస్ విస్టా పేరుతో కొత్త ఎడిషన్ ఆపరేటంగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. సెక్యూరిటీ ఇంకా డేటా ప్రొటెక్షన్ ఫీచర్లు ఈ ఓఎస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ విస్టాకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విండోస్ 7ను మైక్రోసాఫ్ట్ 2009లో విడుదల చేసింది. మల్టీ టచ్, ఫాస్టర్ బూటింగ్, ఇంప్రూవుడ్ విండో మేనేజ్‌మెంట్ వంటి సరికొత్త పీచర్లను ఈ వర్షన్ ద్వారా మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ 7కు సక్సెసర్ వర్షన్‌గా విండోస్ 8ను మైక్రోసాఫ్ట్ 2012లో అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ మార్పు చేర్పులతో రూపుదిద్దుకున్న విండోస్ 8లో స్టార్ట్ మెనూ కనిపించదు. స్టార్ట్ మెనూకు బదులుగా లైవ్ టైల్స్ ఫీచర్ మనకు కనిపిస్తుంది. మైక్రోసాప్ట్ తన విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంను టచ్ స్ర్కీన్ టెక్నాలజీ అలానే టాబ్లెట్ పీసీలను దృష్టిలోఉంచుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ ప్రస్థానం.. నాటి నుంచి నేటి వరకు

విండోస్ 8 ఫేలవమైన ఫలితాలను నమోదు చేయటంతో బిల్ గేట్స్ కంపెనీ తరువాతి వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. విండోస్ 8కు అప్ గ్రేడెడ్ వర్షన్‌గా అందుబాటులోకి తీసుకువచ్చిన విండోస్ 10లో స్టార్ట్ మెనూను తిరిగి పునరుద్ధరించారు. కార్టోనా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి అత్యాదునిక స్మార్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను విండోస్ 10 ద్వారా మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Best Mobiles in India

English summary
Microsoft is pulling the plug on Internet Explorer 8, 9, and 10 next Tuesday. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X