విండోస్ వాడుతున్నారా..? వెంటనే ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి

వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్ దెబ్బకు వేల సంఖ్యలో విండోస్ కంప్యూటర్లు పనిచేయకుండా పోయిన విషయం తెలిసిందే. విండోస్ ఆపరేటింగ్ సిస్టం‌లోని లోపాలాను టార్గెట్ చేస్తూ చాప క్రింద నీరులా మాల్వేర్లు విస్తరిస్తోన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఓ హైసెక్యూరిటీ software patchను విడుదల చేసింది.

విండోస్ వాడుతున్నారా..? వెంటనే ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి

ఈ అప్‌డేట్‌ను విండోస్ ఎక్స్‌పీ దగ్గర నుంచి విండోస్ 10 క్రియేటర్స్ అప్‌డేట్ వరకు వివిధ విండోస్ వర్షన్‌లను వాడుతోన్న యూజర్లు పొందవచ్చు. ఈ software patch విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని 14 సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. దీంతో వివిధ రకాల మాల్వేర్లను మీ ఆపరేటింగ్ సిస్టం అడ్డుకోలగుతుంది. ఈ అప్‌డేట్‌ను పొందాలకునే విండోస్ యూజర్లు ఈ పేజీలోకి వెళ్లి మైకోసాఫ్ట్  software patchను పొందవచ్చు.

English summary
Microsoft issued software patch for Windows users. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot