ఐఈ 10 ఫ్రీ - రిలీజ్ విడుదల చేసిన మైక్రోసాప్ట్

Posted By: Staff

ఐఈ 10 ఫ్రీ - రిలీజ్ విడుదల చేసిన మైక్రోసాప్ట్

శాన్ ఫ్రాన్సికో: సాప్ట్ వేర్ గెయింట్ మైక్రోసాప్ట్ పాపులర్ వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్‌కి సంబంధించి లెటేస్ట్ వర్సన్ సెకండ్ ప్రివ్యూని మార్కెట్లోకి విడుదల చేసింది. మైక్రోసాప్ట్ విడుదల చేసిన ఈ సెకండ్ ప్రీ-రిలిజ్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10లో కొత్త్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్‌10కి సంబంధించి సెకండ్ ప్రివ్యూని 2011లో విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో పాటు విడుదల లాంఛ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లెటేస్ట్ ప్లాట్‌ఫామ్ ఫీచర్స్ అయిన HTML5 Parser, HTML5 Sandbox, Web Workers, HTML5 Forms, Media Query Listeners లాంటి అన్నింటిని ఇది సపోర్టు చేస్తుంది.

ఈ కొత్త బ్రౌజర్ ఫీచర్స్ వల్ల బ్రౌజర్ యూజర్ కంట్రోల్‌లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ కొత్త ఫీచర్స్ వల్ల కాంప్లెక్స్ ఇమేజిలను కూడా చాలా ఈజీగా వెబ్ సైట్స్ లోకి లోడ్ అయ్యే అవకాశం ఉంది.

Internet Explorer 10 Platform Preview contains:
1. Cascading Style Sheets (CSS)

* CSS3 Flexible Box (“Flexbox”) Layout
* Positioned floats
* CSS3 Gradients (on all properties that accept images)
* CSS3 Grid Alignment
* CSS3 Multi-column Layout
* Removal of style sheet limits

2. Document Object Model (DOM) support

* Advanced Hit testing APIs
* CSSOM Floating Point Value support
* Media Query Listeners

3. ECMAScript 5 (ES5) support

* The strict variant of ECMAScript (“ES5 strict mode”)

4. HTML5 support

* Asynchronus Script Execution
* Drag and Drop
* File API
* Forms Validation
* Sandbox
* Web Workers

5. Web performance APIs

ఇక ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ ఫ్లాట్‌ఫామ్ ప్రివ్యూ గనుక చూడాలంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. ఇక యూజర్స్ HTML5 ఫెర్పామెన్స్‌ని గనుక టెస్ట్ చేయాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో www.html5test.com టెస్ట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా విడుదల చేసినటువంటి ఈ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 10వల్ల ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌ని మైక్రోసాప్ట్ డామినేట్ చేయాలని చూస్తుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ నుండి మైక్రోసాప్ట్ ఈ బ్రౌజర్ల విడుదలలో గట్టి పోటీని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. మొజిల్లా ఇటీవలే ఫైర్ ఫాక్స్ 5ని 1000కొత్త ఫీచర్స్‌తో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ క్రోమ్ కూడా క్రోమ్ 12కి సంబంధించి కొత్త ఫీచర్స్‌ని విడుదల చేసే ఆలోచనలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot