మైక్రొసాప్ట్ నుంచి కొత్తగా న్యూ ఆఫీస్ యాప్, అన్నీ ఓ చోటకే..

By Gizbot Bureau
|

అమెరికన్ మల్టీనేషనల్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యూజర్ కోసం న్యూ ఆఫీసు యాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసమే ఈ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. మొబైల్ ప్రొడక్టవిటీ కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన యాప్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నికలిపి ఒకే యాప్‌లో ఇంటిగ్రేడ్ చేసింది. ఇకపై స్మార్ట్ ఫోన్ యూజర్లు మైక్రోసాఫ్ట్ అందించే యాప్ లను వేర్వేరుగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కొత్త యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అన్ని ఫైల్స్ ఇందులో రన్ అవుతాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ New Office యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు App అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్ ద్వారా iOS యూజర్లు కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సింగిల్ యాప్‌పై అన్ని యాప్స్
 

సింగిల్ యాప్‌పై అన్ని యాప్స్

ఈ యాప్ ద్వారా సింగిల్ యాప్‌పై అన్ని యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రివ్యూ కోసం లాంచ్ చేసిన ఈ Offfice యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఓఎస్ యూజర్లు ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్ ద్వారా Office యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

న్యూ ఆఫీసు యాప్ ద్వారా మొబైల్ డివైజ్ ల్లో ఈజీగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ ను Snap ఇమేజ్ మాదిరిగా మార్చేయచ్చు. అలాగే ఆ ఇమేజ్ ను Word ఫైల్ మాదిరిగా ఎడిట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ ఫాం టేబుల్స్ నుంచి ఫ్రింటెడ్ పేజ్ నుంచి వెంటనే Excel కు మార్చుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ 365 ఫైళ్ళకు ప్రత్యక్ష ప్రాప్యతను కలిగి ఉంటారు.

మైక్రోసాఫ్ట్ 365 ఫైళ్ళకు ప్రత్యక్ష ప్రాప్యతను కలిగి ఉంటారు.

సరికొత్త క్రోమియం ఆధారిత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యొక్క సాధారణ లభ్యతను కూడా కంపెనీ ప్రకటించింది. సరికొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్ప్రైజ్ కొత్త టాబ్ పేజీని అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు మైక్రోసాఫ్ట్ 365 ఫైళ్ళకు ప్రత్యక్ష ప్రాప్యతను కలిగి ఉంటారు. ఇది జనవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది.

ఎడ్జ్ బ్రౌజర్ మరిన్ని పరికరాలకు 
 

ఎడ్జ్ బ్రౌజర్ మరిన్ని పరికరాలకు 

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇప్పుడు పరికరాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో విండోస్ 10, విండోస్ 8 ఎక్స్, విండోస్ 7, మాకోస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కన్సోల్ స్ట్రీమింగ్ సేవ 

మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కన్సోల్ స్ట్రీమింగ్ సేవ 

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గత నెలలో తన ఎక్స్‌క్లౌడ్ గేమ్ స్ట్రీమింగ్ ప్రివ్యూ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఎక్స్‌బాక్స్ వన్ ప్రేమికులకు కన్సోల్ స్ట్రీమింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది దీని ద్వారా వినియోగదారులను వారి స్వంత కన్సోల్ నుండి ప్రసారం చేయడం ద్వారా వారి Android స్మార్ట్‌ఫోన్‌లలో వారి Xbox One ఆటలను ఆడటానికి అనుమతిస్తుంది. ఈ లక్షణం ప్రస్తుతం Android యూజర్లకు వచ్చేసింది. కన్సోల్ స్ట్రీమింగ్ Xbox 360 మరియు Xbox One గేమ్ లకు పనిచేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Microsoft launches new Office app that combines Word, Excel and PowerPoint

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X