మహిళల కోసం మైక్రోసాఫ్ట్ ‘గార్డియన్’

Posted By:

‘గార్డియన్' పేరుతో సరికొత్త భద్రతా అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా గురువారం ఆవిష్కరించింది. ఈ  యాప్‌ను విండోస్ మొబైల్ ఫోన్ యూజర్లు తమ భద్రతా అవసరాల దృష్ట్యా ఉపయోగిచుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

 మహిళల కోసం మైక్రోసాఫ్ట్ ‘గార్డియన్’

గార్డియన్ అప్లికేషన్‌లోని ట్రాక్ మీ ఫీచర్‌ను ఆన్ చేసి ఉంచటం ద్వారా, ఆ ఫోన్ వినియోగదారుడు ఎక్కడ ఉన్నదీ గుర్తించేందకు అతని స్నేహితులు.. సన్నిహితులకు వీలవుతుంది.  ఆపద ఎదురైనపుడు తమ సంరక్షణకు ముందు వచ్చే తమ సన్నిహితులు, భద్రతా సంస్థల ఫోన్ నెంబర్లు ఇతర మెయిల్ ఐడీ వివరాలను ఈ అప్లికేషన్‌తో అనుసంధానం చేయవల్సి ఉంటుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ అజూర్ క్లౌడ్, బింగ్ మ్యాప్, ఏపీఐ‌ల ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా తెలిపింది.

ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినట్లయితే ఈ అప్లికేషన్ ద్వారా సన్నిహితులతో పాటు భద్రతా సిబ్బంది , పోలీసులు, ఆసుపత్రుల బాధ్యులతో ఆయా నెంబర్లకు కాల్, ఎస్ఎంఎస్‌లతో పాటు మెయిల్స్‌కు సమాచారం వెళ్తందని మైక్రోసాఫ్ట్ వివరించింది. ఒంటిరిగా వెళ్లే మహిళలకు ఈ అప్లికేషన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ సిబ్బంది 6 నెలల వ్యవధిలో ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ ఐటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ బియానీ అన్నారు. మైక్రోసాఫ్ట్ గార్డియన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot