మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

Posted By:

ఆధునిక వర్షన్ మొబైల్ కీబోర్డ్‌‌తో పాటు వెడ్జ్ టచ్ మౌస్‌లను మైక్రోసాఫ్ట్ ఇండియా గురువారం విపణిలో ఆవిష్కరించింది. పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇంకా ల్యాప్‌టాప్‌లతో ఈ హార్డ్‌వేర్ ఉపకరణాలను ఉపయోగించుకోవచ్చు. ఇదే ఆవిష్కరణ కార్యక్రమంలో అప్‌డేటెడ్ విండోస్ 8 డ్రైవర్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా రిటైల్ సేల్స్ ఇంకా మార్కెటింగ్ సంచాలకులు జి.శ్యామ్ సుందర్ ఓ ప్రకటనలో తెలిపారు.

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

ఈ సరికొత్త కంప్యూటింగ్ ఉపకరణాలను విండోస్ (7,8), ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐప్యాడ్‌లను సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయటం విశేషం. మైక్రోసాఫ్ట్ కొత్త హార్డ్‌వేర్ ఉత్పత్తుల్లో ఒకటైన వెడ్జ్ టచ్ మౌస్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను మీకు చేరువచేస్తుంది. ఫోర్-వే టచ్ స్ర్కోలింగ్ వ్యవస్థ ఆకట్టుకుంటుంది. మౌస్ బ్యాటరీ లైఫ్ నాలుగు నెలల పాటు వస్తుంది. కంప్యూటర్ షట్‌డౌన్ అయినే వెంటనే మౌస్ తనంతటకదే స్వయంచాలకంగా షట్‌డౌన్ అయిపోతుంది. మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన కొత్త హార్డ్‌వేర్ ఉపకరణాలను ధరలతో సహా క్రింది ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోసాఫ్ట్ వెడ్జ్ టచ్ మౌస్ (Microsoft Wedge Touch Mouse):

విండోస్ 8 పీసీలతో పాటు ట్యాబ్లెట్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు,
ఫోర్-వే స్ర్కోలింగ్,
సులభతరమైన నేవిగేషన్,
కేబుల్ ఫ్రీ, బ్లూ ట్రాక్ టెక్నాలజీ,
ఆటోమెటిక్ కంట్రోలింగ్,
ధర రూ.3,015.

 

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోసాఫ్ట్ వెడ్జ్ మొబైల్ కీబోర్డ్ (Microsoft Wedge Mobile Keyboard):

ప్రత్యేకింగా ట్యాబ్లెట్స్ కోసం డిజైన్ చేయబడింది,
విండోస్ 8 హాట్ బటన్లు (క్విక్ సెర్చ్ కోసం),
రబ్బర్ కవర్,
ధర రూ.4,935.

 

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోమ్యాక్స్ స్క ల్ప్ టచ్ మౌస్ (Microsoft Sculpt Touch Mouse):

ఫోర్-వే టచ్ స్ర్కోల్ స్ట్ర్రిప్,
స్మూత్ ఇంకా ఈజీ నేవిగేషన్,
బ్లూటూత్ కనెక్టువిటీ,
అదనపు యూఎస్బీ సపోర్ట్,
ధర రూ.2,765.

 

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోసాఫ్ట్ టచ్ మౌస్ (Microsoft Touch Mouse):

మైక్రోసాఫ్ట్ టచ్ మౌస్‌ను ప్రత్యేకించి విండోస్8 డివైజుల కోసం డిజైన్ చేశారు. ధర రూ.4350.

 

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ టచ్ మౌస్ (Microsoft Explorer Touch Mouse):

విండోస్8 సపోర్టబుల్,
వేగవంతమైన స్ర్కోలింగ్,
వైర్‌లెస్ కనెక్టువిటీ,
ధర రూ.2935.

 

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సరికొత్త మౌస్‌లు, కీబోర్డ్‌

మైక్రోసాఫ్ట్ వైర్‌లెస్ మొబైల్ మౌస్ 3500 (Microsoft Wireless Mobile Mouse 3500):

పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లకు ఈ మౌస్ చక్కటి ఉపకరణం. బ్లూట్రాక్ టెక్నాలజీ ఇంకా ఆడ్వాన్సుడ్ ట్రాకింగ్ టెక్నాలజీ. ధర రూ.1205.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot