Microsoft ఉద్యోగుల‌కు షాక్‌.. 2 నెల‌ల్లో 2వేల మంది తొల‌గింపు!

|

Microsoft ఉద్యోగులకు ఇంకా బ్యాడ్ డేస్ ముగియనట్లు కనిపిస్తోంది. ఇప్ప‌టికే, ఈ ఏడాది జూలైలో 1,800 మందికి పైగా ఉద్యోగులను ఆ సంస్థ‌ తొలగించినట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా, సీఈవో సత్య నాదెళ్ల నేతృత్వంలోని బ్రాండ్ MLX (మోడరన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్) అని పిలవబడే యూజ‌ర్ సెంట్రిక్ గ్రూప్‌ల‌లో ఒకదాని నుండి మరో 200 మంది ఉద్యోగులను తొలగించ‌నున్న‌ట్లు స‌మాచారం. అతిపెద్ద IT దిగ్గజాలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ లో తొలగింపున‌కు సంబంధించిన‌ వివరాలతో ప‌లు నివేదికలు ఇంటర్నెట్‌లో నిండిపోయాయి.

 
Microsoft ఉద్యోగుల‌కు షాక్‌.. 2 నెల‌ల్లో 2వేల మంది తొల‌గింపు!

ఆయా నివేదిక‌ల ప్ర‌కారం అందిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. Microsoft MLX గ్రూప్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించిన‌ట్లు స‌మాచారం. రెండోసారి Microsoft పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ ప్రక్రియలో భాగంగా తొలగింపులు జరిగిన‌ట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే, ఇదే కారణంతో కంపెనీ దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించింది.

బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొన్న ప్ర‌కారం.. మైక్రోసాఫ్ట్ MLX గ్రూప్‌లోని కొంతమంది ఉద్యోగులను సంస్థలోనే వేరే స్థానానికి వెళ్లమని లేదా సెవెరెన్స్ పే(ప‌రిహార ప్యాకేజీ) ఆప్షన్‌కి వెళ్లమని కోరింది. కొత్త పొజిషన్ లేదా సెవెరెన్స్ పే ఆప్షన్‌ను ఎంచుకోవడానికి కంపెనీ ఈ ఉద్యోగులకు 60 రోజుల కాలపరిమితిని అందించిందని నివేదిక పేర్కొంది. " మోడ్ర‌న్ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్ టీంలోని దాదాపు 200 మంది ఉద్యోగులు కంపెనీలో మరొక స్థానాన్ని ఎంపిక చేసుకోవ‌ల్సిందిగా.. లేదా ప‌రిహార ప్యాకేజీని తీసుకోవాలని చెప్పబడింది" అని నివేదిక పేర్కొంది.

Microsoft ఉద్యోగుల‌కు షాక్‌.. 2 నెల‌ల్లో 2వేల మంది తొల‌గింపు!

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను, Microsoft బృందంలోని సీనియ‌ర్ అసోసియేట్ ఒకరు లింక్డ్‌ఇన్‌లో కొత్త తొలగింపు గురించి వివరాలను పంచుకున్నారు. ఈ వారం మోడ్ర‌న్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ స‌భ్యులు "కఠినమైన వార్త" వింటార‌ని పేర్కొంటూ ఒక రహస్య సందేశంలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు. అయితే, ఇది లేఆఫ్ గురించి సూచించబడుతుందో లేదో అతను పేర్కొనలేదు.

దీనిపై Microsoft ఏమంటోంది!
ప్రస్తుతానికి, MLX గ్రూప్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించడంపై మైక్రోసాఫ్ట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈ కంపెనీ గత నెలలో 1,800 మంది ఉద్యోగుల తొలగింపున‌కు సంబంధించిన వార్త‌ల‌పై మాత్రం ధృవీకరించింది. అది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఒక శాతం (సుమారు 1.8 లక్షలు) అన్న‌ట్లు పేర్కొంది. ఈ ప్ర‌క్రియ సాధార‌ణంగా అన్ని కంపెనీలు చేసే ప‌నేన‌ని మైక్రోసాఫ్ట్ అప్ప‌ట్లో చెప్పుకొచ్చింది.

Microsoft ఉద్యోగుల‌కు షాక్‌.. 2 నెల‌ల్లో 2వేల మంది తొల‌గింపు!

మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనను విడుదల చేసింది, "ఈరోజు మేము అన్ని కంపెనీల మాదిరిగానే తక్కువ సంఖ్యలో ఎలిమినేషన్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాం. మేము మా వ్యాపార ప్రాధాన్యతలను క్రమ పద్ధతిలో మూల్యాంకనం చేస్తాము మరియు క్రమ పద్ధతిలో నిర్మాణాత్మక సర్దుబాట్లను చేస్తాము." అని పేర్కొంది. లేఆఫ్‌లు ఉన్నప్పటికీ, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని మరియు రాబోయే సంవత్సరంలో మొత్తంగా హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోందని కంపెనీ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్ పున‌ర్నిర్మాణంలో భాగంగా త‌రువాతి కాలంలో మ‌రింత మందిని నియ‌మించుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. IT దిగ్గజం తాజా ఉద్యోగాల తొలగింపును నిర్ధారిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేస్తుందని మేము ఆశిస్తున్నాము.

Best Mobiles in India

English summary
Microsoft Lays Off 2,000 Employees In Just Two Months; Find Out Why

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X