ఉచితంగా ‘మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365’!

Posted By: Prashanth

ఉచితంగా ‘మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365’!

 

హైదరాబాద్: విద్యార్ధులు తమ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునేందుకు ఉచిత శిక్షణకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365ను రూపొందించినట్టు మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోని సాల్‌సిటో అన్నారు. ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా విద్యార్ధులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ప్రోటోకాల్‌లో అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రోడక్టివిటీ , కమ్యూనికేషన్, కొలాబ్రేషన్ అనుభూతిని అందించేదిగా ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే పేరొందిందని అన్నారు.

మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 అనేది క్లౌడ్ ఆధారిత సూట్ అని అన్నిరు. ఇందులో సుపరిచితమైన మైక్రోసాఫ్ట్ ఆఫీసు డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయని అన్నారు. దాంతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆన్‌లైన్, షేర్ పాయింట్ ఆన్‌లైన్, లింక్ ఆన్‌లైన్ కూడా ఉంటాయని అన్నారు. ఇ మెయిల్, క్యాలండర్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు వెబ్ యాప్స్, వీడియో, ఆన్‌లైన్ మీటింగ్స్‌తో పాటుగా కరిక్యులమ్ ప్లానింగ్, స్టూడెంట్ ప్రాజెక్టులకు అడ్వాన్స్‌డ్ డాక్యుమెంటు క్రియేషన్ ఫీచర్స్ ఉంటాయని చెప్పారు. ఏ ఉపకరణంపై పనిచేస్తున్నా, క్లాస్ ప్రాజెక్టులను రియల్‌టైమ్‌లో కొలాబరేట్ చేసుకోవచ్చని, కరిక్యులమ్ క్రియేట్ చేసుకునేందుకు, ఆన్‌లైన్ టీచింగ్‌కు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting