Home
News

Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో అంతరాయం.. విమాన సహా ఇతర సర్వీసులపై తీవ్ర ప్రభావం..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ( Microsoft Outage Today ) ఏర్పడింది. అనేక మంది వినియోగదారులకు బ్లూ స్క్రీన్‌ లు కనిపించాయి. భారత్‌ కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల కంప్యూటర్‌ లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది.

విమాన సేవలకు అంతరాయం :
ఈ సమస్య కారణంగా భారత్‌, అమెరికా దేశాల్లో అనేక విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, ముంబయిలో కొన్ని విమాన సర్వీసులు రద్దుకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ సమస్య కారణంగా ఇండిగో, స్పైస్‌జెట్‌, ఆకాశ సిస్టమ్‌ లు పనిచేయలేదు. అమెరికాలోని ఎయిర్‌లైన్స్‌ దీనిపై స్పందించింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ అంతరాయం కారణంగా తమ సిస్టమ్‌ లు ప్రభావితమయ్యాయని తెలిపింది.

Microsoft Outage many windows users face blue screen of death

విండోస్‌ సిస్టమ్‌లో బ్లూ స్క్రీన్‌ :
విండోస్‌ సిస్టమ్‌ లో "మీ సిస్టమ్‌కు సమస్య వచ్చిందని, రీస్టార్ట్‌ చేయాలని" బ్లూ స్క్రీన్‌ పైన కనిపిస్తోంది. ఈ సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పేర్కొంది. దీన్ని బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌గా (BSOD) గా తెలిపింది. csagent.sys అనే సిస్టమ్‌ లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్‌తోనే సమస్య వచ్చిందా?
విండోస్‌లో తలెత్తిన ఈ సమస్యను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్‌ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్‌ ఆధారంగా భద్రతా పరిష్కారాలను అందించే Crowdstrike సంస్థ ఇటీవల అప్‌డేట్‌ తో BSOD సమస్య తలెత్తినట్లు సమాచారం.

మీకు కావాల్సినంత సమయం తీసుకోవాలంటూ :
విండోస్‌ లో ఏర్పడిన అంతరాయంపై సోషల్‌ మీడియాలో అనేక మంది యూజర్లు తమ అనుభవాలను వెల్లడిస్తున్నారు. అయితే మిశ్రమ స్పందన వస్తోంది. విండోస్‌ క్రాష్‌ అయిందని.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇదే సమస్య తలెత్తినట్లు భావిస్తున్నట్లు ఒక యూజర్‌ రాసుకొచ్చారు. మరో యూజర్‌ ఆసక్తికరంగా స్పందించారు. సమస్యను వెంటనే పరిష్కరించవద్దని.. మీకు కావాల్సినంత సమయం తీసుకోవాలంటూ మైక్రోసాఫ్ట్‌ ను ట్యాగ్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో మీమ్స్‌ :
విండోస్‌ 11 సిస్టమ్‌లో అకస్మాత్తుగా #BSOD సమస్య తలెత్తిందని.. తనకు, సహోద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురైందని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. విండోస్‌ ఔటేజ్‌తో ఆఫీస్‌ టైంతో విశ్రాంతి దొరికిందని మరో యూజర్‌ స్పందించారు. అనేక వేల మంది విండోస్‌ సమస్యపై స్పందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Microsoft Outage many windows users face blue screen of death issue worldwide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X