Lumia ఫోన్‌లకు మైక్రోసాప్ట్ గుడ్ బై, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ

|

Lumia సిరీస్ ఫోన్‌లను మైక్రోసాఫ్ట్ నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ధీటుగా లుమియా ఫోన్‌లు రాణించలేకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Lumia ఫోన్‌లకు మైక్రోసాప్ట్ గుడ్ బై, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ

Read More : ఆ చైనా ఫోన్‌లు కొనేముందు 100 సార్లు ఆలోచించుకోండి!

డిసెంబర్‌లోగా ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసి, ఆ తరువాత లుమియా ఫోన్‌ల తయారీని పూర్తిగా నిలిపేవేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

#1

#1

ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునే ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ ను మైక్రోసాఫ్ట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు వినికిడి.

#2

#2

చివరిసారిగా లుమియా లైనప్ నుంచి Lumia 950, 950 XL ఫోన్‌లను గతేడాది మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన ఈ ఫోన్‌లు మార్కెట్‌ను ఆకట్టుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాయి.

#3

#3

ఇండియన్ మార్కెట్లోనూ లుమియా డివైస్‌ల విడదలు క్రమకమంగా నెమ్మదించింది. చివరిసారిగా మైక్రోసాప్ట్ తన లుమియా 650 పేరుతో విండోస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్‌లో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.15,299.

#4

#4

Lumia సిరీస్ ఫోన్‌ల స్థానంలో విప్లవాత్మక ఫీచర్లతో కూడిన Surface Phoneలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2017 ఆరంభంలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

#5

#5

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.

#6

#6

అభివృద్థి చెందుతోన్న దేశాల్లో మైక్రోసాఫ్ట్ ఫోన్‌ల వినియోగం ఆశాజనకంగానే ఉన్నప్పటికి అమ్మకాల పరంగా మరింత వృద్థి సాధించాల్సి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ పోన్‌లు బెస్ట్ యూసేజ్ క్వాలిటీని కలిగి ఉన్నాయనటానికి పలు వాస్తవాలను ఇక్కడ ప్రస్తావించటం జరుగుతోంది...

#7

#7

విండోస్ ఫోన్ సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. డివైస్‌లోని యాప్స్ రెప్పపాటులో లోడైపోతాయి. ఫోన్ అరుదుగా హ్యాంగ్ అవటాన్ని మనం చూడొచ్చు.

#8

#8

విండోస్ ఫోన్‌లు సింగిల్ ఛార్జ్ పై 13 నుంచి 14 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలవు. హెవీ యూజర్లకు 10 గంటల బ్యాకప్‌ను కచ్చితంగా పొందవచ్చు.

#9

#9

విండోస్ ఫోన్‌లను తొలత నోకియా ప్రపంచానికి పరిచయం చేసింది. నిర్మాణ పరంగా మైక్రోసాఫ్ట్ అందించే విండోస్ ఫోన్ డివైస్‌లు చాలా ధృఢంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలను ఈ ఫోన్‌లు ఏ మాత్రం లెక్క చేయవు.

#10

#10

మైక్రోసాఫ్ట్ నుంచి లుమియా ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ రూపురేఖలనే మార్చేసాయి. ఈ ఫోన్ కెమెరాలు అందించిన ప్రొఫెషనల్ లెవల్ ఫోటోగ్రాఫ్స్ విండోస్ ఫోన్‌లకు మంచి పేరును తీసుకువచ్చాయి. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన లుమియా డివైస్‌లలో అనేక కెమెరా కంట్రోల్స్‌ను మనం చూడొచ్చు.

#11

#11

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ ఫోన్‌లను కంఫర్ట్‌గా ఫీలయ్యే యూజర్లు చాలా మందే ఉన్నారు. విండోస్ ఫోన్‌లు అందించే స్వైప్ కీబోర్డ్స్, కస్టమైజబుల్ యాక్షన్ సెంటర్, లాక్ స్ర్ర్కీన్ ఆప్షన్స్, గ్లాస్ స్ర్కీన్ టెక్నాలజీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Best Mobiles in India

English summary
Microsoft to reportedly kill Lumia line by December. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X