మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఈ సాఫ్ట్‌వేర్‌లు వాడటం నిషేధం

|

టెక్ కంపెనీలు అన్ని అధిక మొత్తంలో డబ్బును అందించి ఉద్యోగులను తీసుకుంటారు. ఇంత మొత్తంలో చెల్లిస్తున్న వారు ఒక్కొక సారి కాస్త కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అన్ని రకాల కంపెనీలు వారు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లపై చాలా ఖచ్చితంగా ఉంటారు. అలాగే కంపెనీ యొక్క డేటాను కాపాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

 

టెక్ కంపెనీలు

ఇందుకోసం టెక్ కంపెనీలు కొన్ని సమయాల్లో తమ ఉద్యోగులతో కాస్త ‘కఠినంగా' ఉంటాయి. ఇందులో భాగంగా ఇటీవల గూగుల్ సంస్థ రాజకీయ చర్చలపై కొన్ని పరిమితులను విధించింది. అదేవిధంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా తన ఉద్యోగులు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌పై కొన్ని ఆంక్షలు విధించింది.

 

ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??

సాఫ్ట్‌వేర్‌

ఇప్పుడున్న కాలంలో హకర్లు ఎటువంటి సాఫ్ట్‌వేర్‌లనైనా చాలా సులువుగా హ్యాక్ చేస్తున్నారు. కంపెనీల యొక్క ముఖ్యమైన సమాచారం ప్రత్యర్థి కంపెనీల చేతికి వెళితే కనుక వారికి అధిక మొత్తంలో నష్టం కలగవచ్చు. అందుకోసం ఉద్యోగులకు కొన్ని నియమాలను పెడుతూవుంటారు. కొంత మందికి కేవలం వారి యొక్క కొన్ని సాఫ్ట్‌వేర్‌లను యాక్సిస్ చేయడానికి మాత్రమే అనుమతిని ఇస్తూఉంటారు.

 

జియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలుజియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలు

మైక్రోసాఫ్ట్
 

ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు కొన్ని సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించకూడదు అని కొన్ని నియమాలను పెట్టింది. వీటిని ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా హెచ్చరించారు. కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ సంస్థలకు సంబందించిన ముఖ్యమైన డేటా హ్యాక్ అవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.

 

అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

గూగుల్ మరియు అమెజాన్

అందుకోసం గూగుల్ మరియు అమెజాన్ వంటి ప్రత్యర్థులు అభివృద్ధి చేసినవి కొన్ని సాఫ్ట్‌వేర్‌లపై ఆంక్షలను విధించింది. నిషేధిత సాఫ్ట్‌వేర్ జాబితాను కొన్ని నెలల క్రితం గీక్‌వైర్ కనుగొంది. ఈ జాబితాలో ఉన్న సాఫ్ట్‌వేర్‌లు తమ ప్రత్యర్థి సంస్థల నుండి వచ్చిన సాఫ్ట్‌వేర్ అయినందున కాదు. అవి తగినంత భద్రంగా లేనందున నిషేదించబడింది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఉపయోగించకుండా నిషేధించిన సాఫ్ట్‌వేర్‌ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఫిట్‌బిట్ అకౌంట్ మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?ఫిట్‌బిట్ అకౌంట్ మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

నిషేదించిన సాఫ్ట్‌వేర్‌ల జాబితా

నిషేదించిన సాఫ్ట్‌వేర్‌ల జాబితా

*** స్లాక్ ఫ్రీ, స్లాక్ స్టాండర్డ్ మరియు స్లాక్ ప్లస్

*** గూగుల్ DOCs

*** (Kaspersky) కాస్పెర్స్కీ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్

*** అమెజాన్ వెబ్ సర్వీసెస్

*** GitHub (క్లౌడ్ వెర్షన్ మాత్రమే)

*** పేజర్ డ్యూటీ

*** గ్రామర్లి

 

Best Mobiles in India

English summary
Microsoft Restrict to Employees for using some Software and Apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X