ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

Written By:

నోకియా...స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఒకప్పుడు తిరుగులేని రారాజు. కాని పరిస్థితులు తెర వెనక్కు వెళ్లేలా చేశాయి. గత కొద్దిసంవత్సరాల నుంచి నోకియా నుంచి ఎటువంటి ఫోన్లు బయటకు రాలేదు. అయితే మైక్రోసాఫ్ట్ నోకియాను కొనుగోలు చేయడంతో దాని పరిస్థితి మారుతుందని అందరూ అనుకున్నారు. కాని దూసుకొచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ల ముందు నోకియా చిన్నబోయింది. పోయిన చోటే వెతుక్కోవాలని ఇప్పుడు సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తోంది.
Read more : ప్రపంచాన్ని ఊపేసిన 18 నోకియా ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

మళ్లీ నోకియా బ్రాండ్లు ఫోన్లు, ట్యాబ్‌లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు ఫాక్స్‌కాన్ కంపెనీలకు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

వచ్చే పదేళ్ల పాటు నోకియా బ్రాండ్‌ ఫోన్లు, టాబ్లెట్లు తయారు చేసేందుకు హెచ్‌ఎండి గ్లోబల్‌ లిమిటెడ్‌కు అంతర్జాతీయ లైసెన్సును, ఐపిఆర్‌ హక్కులను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం వచ్చే పదేళ్లపాటు హెచ్‌ఎండి నుంచి నోకియాకు రాయల్టీలు వస్తాయి. హెచ్‌ఎండిలో నోకియాకు డైరెక్టర్‌ పదవి లభిస్తుంది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

ఒప్పందంలో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్‌ మరియు దాని తైవానీస్‌ భాగస్వామి ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌ (ఫాక్స్‌కాన్‌ అనుబంధ సంస్థ) కలిసి మైక్రోసాఫ్ట్‌ చెంతనున్న ఫీచర్‌ ఫోన్‌ బ్రాండింగ్‌ను 35 కోట్ల డాలర్లకు టేకోవర్‌ చేయనున్నాయి.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్, ఈ సంస్థ తైవాన్ భాగస్వామి ఎఫ్‌ఐహెచ్ మొబైల్ ఆఫ్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. కొత్త వ్యాపారంపై వచ్చే మూడేళ్లలో 50 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు హెచ్‌ఎండి గ్లోబల్‌ వెల్లడించింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత శామ్‌సంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

2014లో తన హ్యాండ్‌సెట్ వ్యాపారాన్ని నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్‌ 720 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. అప్పటినుంచి కంపెనీ నోకియా తన బ్రాండ్‌ను కోల్పోయింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫీచర్ ఫోన్లకు మాత్రం నోకియా బ్రాండ్‌ను వాడి లూమియా బ్రాండ్ కింద స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. మైక్రోసాఫ్ట్‌తో కుదుర్చుకున్న బ్రాండ్ లెసైన్సింగ్ ఒప్పందం ఈ ఏడాది మధ్యకల్లా ముగియనున్నదని అంచనా.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

ఈ నేపథ్యంలో తమ బ్రాండ్‌లైసెన్సును హెచ్‌ఎండికి విక్రయించేందుకు నోకియా సిద్ధమైంది. హెచ్‌ఎండిగ్లోబల్‌లో తమకు వాటాలు లేవని నోకియా ప్రకటించింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

2011లో స్మార్ట్‌ఫోన్ల రంగంలో హవా చూపాలన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌తో ఫోన్లను ఉత్పత్తి చేసింది. అయితే విండోస్‌ ప్లాట్‌ఫామ్‌ ప్లాప్‌ కావడంతో నోకియా ప్రస్థానం ముగిసింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ఫోన్లను ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌తో రూపొందిస్తామని తాజాగా కంపెనీ తెలిపింది. గతంలో ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌ నోకియాకు చెందిన ఎన్‌1 టాబ్లెట్లను ఉత్పత్తి చేసింది.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

భారత ప్రభుత్వానికి, నోకియాకు మధ్య నలుగుతున్న 10వేల కోట్ల రూపాయల పన్ను వివాదం నోకియా బ్రాండ్‌ ఫోన్ల విక్రయాలపై ఉండదని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ మహీంద్రూ అభిప్రాయపడ్డారు.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

ఫోన్ల విభాగంలో నోకియా బలమైన బ్రాండ్‌ అని, ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ ఇండియాలో నోకియా ఫోన్లను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. భారత, వియత్నాంల్లో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యంతో నోకియా ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.

ఆండ్రాయిడ్‌తో నోకియా రీ ఎంట్రీ : మిగతా ఫోన్ల పరిస్థితి...?

మరి రానున్న నోకియా ఫోన్లు ఓ కొత్త ఒరవడికి నాంది పలికేలా ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఉండేలా రూపొందించినున్నారని తెలుస్తోంది. మరి ఏ అంచనాలతో వస్తాయో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft selling feature phone business to FIH Mobile Ltd. and HMD Global Oy
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot