మొజిల్లా బ్రౌజర్ టీమ్‌ని అభినందిస్తూ మైక్రోసాప్ట్ కేక్ పంపిన వైనం

Posted By: Staff

మొజిల్లా బ్రౌజర్ టీమ్‌ని అభినందిస్తూ మైక్రోసాప్ట్ కేక్ పంపిన వైనం

ప్రస్తుత ప్రపంచంలో బౌజర్లను విడుదల చేయడంలో మైక్రోసాప్ట్, మొజిల్లా రెండు తమదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి. ఒకరికొకరు పోటీగా బ్రౌజర్లకు సంబంధించిన కొత్త వర్సన్స్‌ని పోటీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాయి. ఐతే ఈ రెండిండి మద్య బ్రౌజర్లను విడుదల చేయడంలో సద్బావమైన వాతావరణం నెలకోని ఉంది. అందుకు మీకు ఓ ఉదాహారణను తెలియజేస్తాను. మైక్రోసాప్ట్ కంపెనీ మొజిల్లా బ్రౌజర్ కొత్త వర్సన్‌ని విడుదల చేసిన ప్రతిసారి వారిని అభినందిస్తూ కేక్ పంపే అలవాటుని చేసుకుంది. మైక్రోసాప్ట్ ఇలా చేయడానికి గల కారణం మొజిల్లా బ్రౌజర్‌ని విడుదల చేసినటువంటి టీమ్‌కి వారి హార్డ్ వర్క్‌ని గుర్తించి అభినందనలు తెలియజేయడం కోసన్నమాట. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల రెండింటి మద్య మంచి పాజిటివ్ వాతావరణం నెలకొంటుందని వారి అభిప్రాయం.

ఇలా మైక్రోసాప్ట్ పంపినటువంటి బిగ్ ట్వీట్‌ని అతిధులు మొజిల్లా టీమ్ ఆహ్వానించింది. అంతేకాకుండా మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ 9కి సంబంధించిన ఫీచర్స్‌ని కూడా వారికి ఆ కేక్ తెలియజేస్తుంది. దీనికి మొజిల్లా టీమ్ వారి యొక్క కృతజ్ఞతలను ట్విట్టర్‌లో తెలియజేశారు. దానికి సంబంధించిన ఫోటోలు మీ కోసం ప్రత్యేకంగా ఈ క్రింది ట్వీట్ లో https://twitter.com/#!/damons/status/83269804823293952 ఉన్నాయి. ఎంజాయ్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting