స్కైప్ ట్రాన్స్‌లేటర్ అప్లికేషన్‌ను ప్రదర్శించిన మైక్రోసాఫ్ట్

Posted By:

స్కైప్ వీడియో చాటింగ్ అప్లికేషన్ ద్వారా సంభాషణలు సాగించేవారికి భవిష్యత్ కాలంలో భాషాపరమైన ఆటంకాలు తొలగిపోనున్నాయి. స్కైప్ ద్వారా మాట్లాడుకునే మాటలను తక్షణం ఇతర భాషల్లోకి అనువదించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ తొలిసారిగా ప్రదర్శించింది. కాలిఫోర్నియాలోని రాంచో పాలోస్ వెర్డెస్‌లో జరిగిన కోడ్ కాన్ఫిరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, స్కైప్ ట్రాన్స్‌లేటర్  ఫీచర్‌ను ప్రపంచానికి ప్రదర్శించి చూపారు.

 స్కైప్ ట్రాన్స్‌లేటర్ అప్లికేషన్‌ను ప్రదర్శించిన మైక్రోసాఫ్ట్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వివిధ భాషల్లో మాట్లాడే వారి మాటలను తమకు అర్థమయ్యే భాషలో వినటానికి ఇది తోడ్పడుతుందని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల వివరించారు. ఈ సాంకేతికతను పరిశోధనా స్ధాయి నుంచి వాస్తవ రూపానాకి తీసుకురావటం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. వచ్చే ఏడాది చివరిటానికి ఈ ఫీచర్‌ను అందుబాటోలకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని సత్య నాదెళ్ల ఆశాభావం వ్యక్తం చేసారు. స్కైప్‌కు ప్రపంచవ్యాప్తంగా 300 పై చిలుకు యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరి మధ్య రోజుకు 2 బిలియన్ నిమిషాల సంభాషణలు సాగుతుంటాయి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/eu9kMIeS0wQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot