మైక్రోసాఫ్ట్ దుకాణాల్లో సామ్‌సంగ్ ఫోన్‌లు

సామ్‌సంగ్‌తో కదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన రిటైల్ స్టోర్‌లలో గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించబోతోంది. ఫోన్ రిటైలింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ దిగ్గజ సంస్థ ఇటు యాపిల్‌తోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

Read More : స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్‌లు కూడా..

త్వరలో, మైక్రోసాఫ్ట్ స్టోర్‌లలో సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే కాదు యాపిల్ ఐఫోన్‌లను కూడా మనం చూడొచ్చు.

మైక్రోసాఫ్ట్ లోగోతో..

సాఫ్ట్‌పీడియా రిపోర్ట్స్ ప్రకారం మైక్రోసాఫ్ట్ విక్రయించబోయే యాపిల్ ఐఫోన్‌లు మైక్రోసాఫ్ట్ లోగోతో లభ్యమవుతాయట. మైక్రోసాఫ్ట్ ఎడిషన్ క్రింద వీటిని విక్రయిస్తారట.

ఏప్రిల్ 1 నుంచి మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్‌లలో ..

మైక్రోసాఫ్ట్ ఎడిషన్ ఐఫోన్‌లు ఏప్రిల్ 1 నుంచి మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 మైక్రోసాఫ్ట్ ఎడిషన్ ధర 899 డాలర్లు (మన కరెన్సీలో రూ.58,261). సిల్వర్, రోజ్ గోల్డ్, మాటీ బ్లాక్ ఇంకా జెట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని మొబైల్ బ్రాండ్‌లతో ఒప్పందం..

తన ఫోన్ రిటైలింగ్ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మైక్రోసాఫ్ట్ మరిన్ని మొబైల్ బ్రాండ్‌లతో ఒప్పందాలు కదుర్చుకోబోతున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft starts selling Apple iPhones after Samsung Galaxy S8 deal. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting