Home
News

Microsoft Outage మైక్రోసాఫ్ట్‌ కీలక వ్యాఖ్యలు.. విండోస్‌లో మరోసారి అలాంటి పరిస్థితే రావొచ్చని హెచ్చరిక..!!

మైక్రోసాఫ్ట్‌లో ఈనెల 19న తలెత్తిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో కంప్యూటర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సమస్యను బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ ఎర్రర్‌గా (BSOD) పేరొన్నారు. Crowdstrike లో అప్‌డేట్‌ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అదే రోజు మైక్రోసాఫ్ట్‌ (Microsoft Outage) ఈ సమస్యను పరిష్కరించింది.

మరోసారి విండోస్‌లో అంతరాయం కలగవచ్చు.. మేం ఏం చేయలేం :
అయితే తాజాగా మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది. భవిష్యత్‌లో మరోసారి క్రౌడ్‌స్ట్రైక్‌ తరహా అంతరాయం తలెత్తే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకుండా నిరోధించే అవకాశం లేదని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది.

windows outage could happen again in future

యూరోపియన్‌ కమిషన్‌ ఇటీవల రూపొందించిన కొత్త నిబంధనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. థర్డ్ పార్టీ విక్రేతలకు కూడా OS కెర్నల్‌ వెర్షన్‌ పూర్తి యాక్సెస్‌ను పొందేలా కొత్త నిబంధనను యూరోపియన్‌ కమిషన్‌ తీసుకొచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లకు ఉండే స్థాయిలోనే క్రౌడ్‌ స్ట్రైక్‌ వంటి థర్డ్‌ పార్టీ సంస్థల ఇంజినీర్లకు పూర్తి యాక్సెస్‌ ఉంటుంది. WSJ నివేదికలో మైక్రోసాఫ్ట్‌ ఈ ప్రస్తావన చేసింది.

మైక్రోసాఫ్ట్‌లో ఇటీవల తలెత్తిన అంతరాయం కారణంగా సుమారుగా రోజంతా అనేక సంస్థలు తమ కార్యకాలాపాలను నిర్వహించలేకపోయాయి. విమానయాన రంగంపైనా ప్రభావం పడింది. అనేక విమానాల రద్దు సహా ఆలస్యంగా ప్రయాణాలను ప్రారంభించాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై అనేక మంది సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే క్రౌడ్‌ స్ట్రైక్‌ సంస్థ మాత్రం దీనిపై వివరణ ఇచ్చింది. విండోస్‌లో కేవలం సాంకేతిక అంతరాయం మాత్రమే తలెత్తిందని.. ఎటువంటి భద్రతా మరియు సైబర్‌ అటాక్‌ కాదని స్పష్టంచేసింది. ఈ సమస్య విండోస్‌ సిస్టమ్‌లలోనే తలెత్తింది. ఆపిల్‌ యూజర్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొలేదు. ఎందుకంటే థర్డ్‌ పార్టీ విక్రేతలకు విండోస్‌ తరహా యాక్సెస్‌ను ఆపిల్‌ అందించలేదు.

అయితే జులై 19 మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన అంతరాయం సమయంలో సోషల్‌ మీడియాలో వివిధ రకాల మీమ్స్‌ చక్కర్లు కొట్టాయి. సమస్యను వెంటనే పరిష్కరించవద్దని.. మీకు కావాల్సినంత సమయం తీసుకోవాలంటూ మైక్రోసాఫ్ట్‌ను ఓ యూజర్‌ ట్యాగ్‌ చేశారు. విండోస్‌ 11 సిస్టమ్‌లో అకస్మాత్తుగా #BSOD సమస్య తలెత్తిందని.. తనకు, సహోద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురైందని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. విండోస్‌ ఔటేజ్‌తో ఆఫీస్‌ టైంతో విశ్రాంతి దొరికిందని మరో యూజర్‌ స్పందించారు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
microsoft statement that windows outage could happen again in future and they won't able to prevent
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X