యాహు కొనేందుకు బిడ్ వేసిన మాట వాస్తమే: స్టీవ్ బల్ల్మేర్

Posted By: Staff

యాహు కొనేందుకు బిడ్ వేసిన మాట వాస్తమే: స్టీవ్ బల్ల్మేర్

వెబ్ 2.0 కాన్పరెన్స్‌లో మైక్రో సాప్ట్ సిఈవో స్టీవ్ బల్ల్మేర్ మాట్లాడుతూ మైక్రోసాప్ట్ ప్రస్తుతం సోషల్ వెబ్ సైట్స్‌పై ప్రత్యేకమైన ఆసక్తిని చూపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వెబ్ కాన్పరెన్స్‌లో మైక్రోసాప్ట్ రాబోయే ప్రణాళికలను ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మొదటగా యాపిల్ కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్5లో ట్విట్టర్‌ని అనుసందానం చేసిన విషయంపై ప్రస్తావిస్తూ యాపిల్ కూడా సోషల్ వెబ్ సైట్స్‌పై ఇప్పడిప్పడే ఆసక్తి చూపుతుందని అన్నారు.

మైక్రోసాప్ట్ ఇటీవలే ఆన్‌లైట్ వీడియో, ఛాట్, వాయిస్ అప్లికేషన్ అయిన స్కైపీని కొనుగోలు చేయడంతో పాటు ప్రముఖ సోషల్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌తో భాగస్వామం లాంటి మహాత్తరమైన భాద్యతలను చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం మైక్రోసాప్ట్ సోషల్ భాగానికి అనుసంధానంగా పని చేస్తుందని అన్నారు. విండోస్ లైవ్ ఐడిలతో కూడా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ పర్సన్స్‌కు అనుసంధానం అవ్వోచ్చని తెలిపారు.

ఇదే సందర్బంలో గూగుల్ ప్లస్ గురించి ప్రస్తావించగా, స్టీవ్ బల్ల్మేర్ దీనిపై స్పందించడానికి నిరాకరించారు. అంతేకాకుండా మైక్రోసాప్ట్, స్కైప్‌ని కొనుగోలు చేయడంతో మరింత గట్టిపడుతుందని తెలిపారు. గత కొంతకాలంగా మైక్రోసాప్ట్ యాహు కంపెనీని కొనుగోలు చేయనుందని వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. గత సంవత్సరం యాహుని కొనుగోలు చేద్దామని 44.6బిలియన్ డాలర్లకు బిడ్ వేసిన వాస్తమేనని అన్నారు.

సెర్చ్ ఇంజన్ మార్కెట్ బింగ్ గురించి తెలియజేస్తూ మార్కెట్లో ప్రస్తుతం రెండవ స్దానంలో కొనసాగుతున్నామని తెలిపారు. సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ మొదటి స్దానంలో ఉండగా, బింగ్ 15శాతంతో రెండవ స్దానంలో ఉందని తెలియజేశారు. క్లౌడ్ మార్కెట్‌లో మాత్రం మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌‌ అధిగమించిందని తెలియజేశారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ, యాపిల్ ఐఫోన్‌కి మాత్రం మైక్రోసాప్ట్ విండోస్ 8 ఫోన్స్ గట్టి ఫోటీని ఇస్తాయని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot