మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ఎందుకు ప్రత్యేకంగా ఉందొ తెలుసా??

|

మైక్రోసాఫ్ట్ సంస్థ అత్యంత శక్తివంతమైన మరియు తన మొట్టమొదటి సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియోని లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో సర్ఫేస్ బుక్ లైన్‌కు అప్ డేట్ వెర్షన్ గా వస్తుంది. దీనితో ల్యాప్‌టాప్‌ను సర్ఫేస్ స్టూడియోగా మార్చడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వేరుచేయగల డిస్‌ప్లే డిజైన్‌ను ముందుకు లాగడానికి అనుకూలంగా కంపెనీ ఒక ప్రధాన రీడిజైన్‌ను తీసుకువచ్చింది. ముందు వాటి కంటే ఈ ల్యాప్‌టాప్ చాలా మెరుగ్గా ఉందొ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ధరలు & లభ్యత వివరాలు

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ధరలు & లభ్యత వివరాలు

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో విండోస్ 11 తో రన్ అవుతూ $ 1599.99 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.1,18,113. అలాగే మరొక మోడల్ $3,099.99 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.2,28,846. ఈ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో అక్టోబర్ 5 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్ వచ్చేసింది!! రియల్‌మి ప్రొడెక్టులపై మరిన్ని ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్ వచ్చేసింది!! రియల్‌మి ప్రొడెక్టులపై మరిన్ని ఆఫర్లు

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో స్పెసిఫికేషన్స్
 

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో స్పెసిఫికేషన్స్

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది అతి పెద్ద స్మార్ట్ ఫోన్ వలె 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డాల్బీ విజన్‌ మద్దతుతో 14.4-అంగుళాల పిక్సెల్సెన్స్ ఫ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యొక్క డిస్‌ప్లే 2400 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఈ డివైస్ చాలా మన్నికైనది మరియు కొత్త ఫ్లెక్సిబుల్ డైనమిక్ వొవెన్ హింగ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ స్టేజ్ మరియు స్టూడియో అనే మూడు మోడ్‌ల మధ్య పరికరాన్ని మార్చడానికి అనుమతిస్తుంది.

Amazon Great Indian Festival సేల్ మొదలుకానున్నది!! వీటిపై భారీ ఆఫర్లు ఉన్నాయిAmazon Great Indian Festival సేల్ మొదలుకానున్నది!! వీటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ప్రత్యేకతలు

ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా కీబోర్డ్ మరియు హ్యాప్టిక్స్‌తో కొత్త టచ్‌ప్యాడ్‌తో వస్తుంది. మీరు ల్యాప్‌టాప్ మోడ్‌లోనే కీబోర్డ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే స్టేజ్ మోడ్‌లో డిస్‌ప్లేను మీ వైపుకు తీసుకువచ్చే కీబోర్డ్‌ని మీరు కలిగిఉంటారు. ఈ కోణంలో గేమింగ్, స్ట్రీమింగ్ కోసం రూపొందించబడినట్లు కంపెనీ పేర్కొంది. స్టూడియో మోడ్‌లో ల్యాప్‌టాప్ టాబ్లెట్‌గా మారుతుంది. ఇందులో భాగంగా రాయడం, స్కెచింగ్ మరియు మరిన్నింటికి సరైనదిగా ఉంటుంది.

సర్ఫేస్ స్లిమ్ పెన్ 2

బేస్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది మరియు సర్ఫేస్ స్లిమ్ పెన్ 2 ను కలిగి ఉంది. వీటిని మీరు విడిగా కొనుగోలు చేయాలి. ఈ డివైస్ 11 వ తరం ఇంటెల్ కోర్ i5 లేదా కోర్ i7 ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. కోర్ i5 మోడల్ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో వస్తాయి. అయితే కోర్ i7 వేరియంట్‌లు Nvidia యొక్క RTX 3050 Ti GPU తో వస్తాయి. ల్యాప్‌టాప్ 16GB/32GB RAM తో పాటు 2TB వరకు తొలగించగల SSD స్టోరేజ్‌తో వస్తుంది. సర్ఫేస్ ప్రో 8 మాదిరిగానే సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో కూడా రెండు USB టైప్-సి థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లతో వస్తుంది. ఇది సాధారణ సర్ఫేస్ కనెక్ట్ ఛార్జింగ్ పోర్ట్ మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో కూడా వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Microsoft Surface Laptop Studio Launched With Specical Features: Price, Specifications, sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X