భారీ ఆఫర్లతో సర్ఫేస్ గో ల్యాపీలు, ఈఎంఐలతో పాటు డిస్కౌంట్లు
మైక్రోసాఫ్ట్ కంపెనీ అత్యాధునికమైన తమ సర్ఫేస్ డివైస్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలోని ప్రీమియం రిటైల్ స్టోర్లన్నింటిలోనూ ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కాగా వీటిని తేలికపాటి నెలసరి వ
మైక్రోసాఫ్ట్ కంపెనీ అత్యాధునికమైన తమ సర్ఫేస్ డివైస్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలోని ప్రీమియం రిటైల్ స్టోర్లన్నింటిలోనూ ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కాగా వీటిని తేలికపాటి నెలసరి వాయిదాల విధానంలో కూడా అందించనున్నారు. మార్కెట్‌లోకి వచ్చిన ఉత్పత్తుల్లో సర్ఫేస్ ప్రో6, సర్ఫేస్ లాప్‌టాప్2, సర్ఫేస్ బుక్ 2, సర్ఫేస్ గో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అధికారిక పంపిణీదారు హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ ద్వారా వీటిని విడుదల చేశారు. సిటీ బ్యాంక్ క్రెడిట్‌కార్డులున్న వారికి పరిమిత కాలం పాటు ఈ డివైస్‌ల కొనుగోలుపై క్యాష్‌బాక్ సదుపాయాన్ని అందిస్తున్నట్టు ఆ బ్యాంక్ ప్రకటించింది.

ఇఎమ్ఐ ఎంపికలలో
అధునాతన సర్ఫేస్ ప్రో 6, సర్ఫేస్ ల్యాప్ టాప్ 2 మరియు సర్ఫేస్ బుక్ 2 వంటి అత్యాధునిక సర్ఫేస్ సాధనాలు కస్టమర్లకు ప్రీమియమ్ రీటైల్ స్టోర్లలో ఇఎమ్ఐ ఎంపికలలో లభించనున్నాయి. క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, ఇండియాలోని ఇతర ఎంపిక చేసిన రిటైలర్ల వద్ద లభిస్తున్నాయి.

సిటిబ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు మరియు స్టోరు వివరాలు
సర్ఫేస్ గోను ప్రతీ ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు సిటిబ్యాంక్ వివిధ ఆఫర్లు అందించనున్నది. 30 జూన్ 2019 వరకు ఇండియా లోపల షిప్పింగు చేయబడే ఈ సర్ఫేస్ సాధనాల కొనుగోలుపై సిటిబ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. సర్ఫేస్ బుక్2పై రూ. 7500, సర్ఫేస్ లాప్‌టాప్‌పై రూ. 5 వేలు, సర్ఫేస్ ప్రొపై 5 వేలు, సర్ఫేస్ గోపై రూ. 3వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించనుంది. స్టోర్ వివరాల కోసం Microsoft.com/en-in/retailers/surface చూడవచ్చు.

సర్ఫేస్ ల్యాప్ టాప్ 2 ఫీచర్లు
సర్ఫేస్ ల్యాప్‌టాప్ 2 పలుచగా, తేలికగా ఉంటుంది. అధునాతన 8వ జనరేషన్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. పాత వర్షన్ కంటె 85 శాతం ఎక్కువ శక్తివంతమైనది. 14.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అత్యుత్తమ శ్రేణి కీబోర్డ్ మరియ ట్రాక్ ప్యాడ్లను కలిగి ఉంటుంది. పనిలో ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవారు ఉపయోగించే ప్రత్యేకమైన ఈ డివైస్ సర్ఫేస్ బుక్ 2 నాలుగు వేరు వేరు మోడ్స్ - స్టుడియో మోడ్, ల్యాప్ టాప్ మోడ్, వ్యూ మోడ్, లేదా చివరికి టాబ్లెట్ మోడ్‌తో సహా, సింపుల్ గా స్క్రీన్ ని తొలగించటం ద్వారా సపోర్ట్ చేస్తుంది. 1.15 పౌండ్స్ బరువు, 8.3 మిమి సాంద్రత మరియు 10 అంగుళాలు నిడివి ఉన్న సర్పేస్ గో చాలా బ్యాగులలో చక్కగా ఇమిడిపోతుంది.

సర్పేస్ ప్రో 6 ఫీచర్లు
క్వాడ్-కోర్, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ కలిగిన డివైస్ వైవిధ్యత, పోర్టబిలిటీ మరియు పవర్ కలిగి ఉంది. పాత వర్షన్ కంటే 1.5 రెట్లు వేగవంతమైనది. దీని బ్యాటరీ లైఫ్ రోజంతా ఉంటుంది. సర్ఫేస్ ప్రో 6 విశిష్టతలలో 12.3 పిక్సెల్ సెన్స్ టీఎం డిస్ప్లే ఒకటి. విండోస్ 10 లో పాస్ వర్డ్-ఫ్రీ విండోస్ హలో సైన్-ఇన్ మరియు విండోస్ టైమ్ లైన్ వంటి సమయం ఆదా చేసే ఫీచర్లతో వినియోగదారులు తమ సర్పేస్ ప్రో 6 లో చాలా ప్రయోజనం పొందుతారు.


Click it and Unblock the Notifications








