మైక్రోసాఫ్ట్ అభిమానులకు శుభవార్త!

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అత్యాధునిక కంప్యూటింగ్ పరిజ్ఞానంతో డిజైన్ కాబడిన ఈ అరచేతి కంప్యూటర్‌లను మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 26నుంచి విక్రయించనుంది. ఇదే రోజున విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి రావటం మరో విశేషం. ఆపిల్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నంగా రూపుదిద్దుకున్న ‘సర్‌ఫేస్ టాబ్లెట్’రెండు వర్షన్‌లలో విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన ఓ అనధికార సమాచారం, సర్‌ఫేస్ టాబ్లెట్ బేస్ మోడల్ ధర $1,000, ఆడ్వాన్సుడ్ వర్షన్ ధర $2,150 (ఇండియన్ మార్కెట్ ధర రూ.1,20,000). ఈ ధరను మైక్రోసాఫ్ట్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇదే నిజమైతే.. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమవుతుంది.
సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి ఫీచర్లు:
* విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం,
* 9.3 మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు,
* 10.6 అంగుళాల క్లియర్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,
* ఎన్-విడియా చిప్,
* ఆఫీస్ ‘15’ అప్లికేషన్స్,
* పోర్ట్స్ (మైక్రోఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో,
* టచ్‌కవర్, టైప్‌కవర్,
* మెమరీ వేరియంట్స్ 32జీబి, 64 జీబి.
సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో:
* విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం,
* 13.5 మిల్టీ మీటర్ల మందం, 903 గ్రాముల బరువు,
* 10.6 అంగుళాల క్లియర్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
* పోర్ట్స్ ( మైక్రోఎస్డీఎక్స్ సీ, యూఎస్బీ 3.0, మినీ డిస్ ప్లే పోర్టు వీడియో),
* టచ్‌కవర్, టైప్‌కవర్, పెన్ విత్ పామ్ బ్లాక్,
* మెమరీ వేరియంట్స్ 64జీబి, 128జీబి.


Click it and Unblock the Notifications








