కంటి వైద్యానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, తెలంగాణలో ప్రయోగాత్మకం

పిల్లలోని కంటి సమస్యలను ముందుస్తుగానే గుర్తించేందుకు అవసరమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఉపయోగించుకోబోతోంది. MINE platform పేరుతో అందుబాటులో ఉండే ఈ టెక్నాలజీని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసింది.

Read More : జియోఫోన్ వాట్సాప్‌ను సపోర్ట్ చేస్తుంది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ..

నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఈ ప్రోగ్రామ్‌ను రన్ చేసేందుకుగాను తెలంగాణ సర్కార్ అలానే మైక్రోసాఫ్ట్‌లు అవగాహన ఒప్పంద పత్రం (MoU) పై సంతకాలు చేసాయి. MINE అంటే మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ నెట్‌వర్క్ ఫర్ ఐకేర్ అని అర్థం. ఐకేర్ ప్రొవైడర్స్ అలానే రిసెర్చ్ అండ్ అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఈ ప్లాట్ ఫామ్ ఒక గ్లోబల్ కన్సార్టియమ్‌లా వ్యవహరిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పబ్లిక్ హెల్త్ స్ర్కీనింగ్ లోకి తీసుకువచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

విప్లవాత్మక ఆవిష్కరణతో మైక్రోసాఫ్ట్

కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం పరుగులుపెడుతోన్న నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణతో సంచలనం సృష్టించబోతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్‌‌లతో పాటు డేటా టెర్మినల్స్‌కు ఎల్టీఈ స్పీడ్‌తో కూడిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ డేటాను అందిచేందుకు మైక్రోసాఫ్ట్ సొంతంగా ఓ సిమ్ కార్డ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

సెల్యులార్ డేటా అనే యాప్‌

ఈ ప్రాజెక్టు కోసం సెల్యులార్ డేటా అనే యాప్‌ను మైక్రోసాఫ్ట్ శరవేగంగా అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం. వెర్జ్ చెబుతోన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ పరీక్షిస్తోన్న యాప్ విండోస్ 10 డివైస్‌లను ఏ విధమైన కాంట్రాక్ట్‌తో పనిలేకుండా వివిధ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

విండోస్ స్టోర్‌ల ద్వారా విక్రయించే అవకాశం..

ఈ సిమ్‌కార్డ్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఏవిధమైన వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ సిమ్‌కార్డ్‌ను విండోస్ స్టోర్‌ల ద్వారా మైక్రోసాఫ్ట్ విక్రయించే అవకాశముంది.

అంతా ఆయన చొరవే..

ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ వైపు నడుస్తోందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft ties up with Telengana to use AI to screen kids for eye issues. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot