సింహాసనం పై కన్నేసిన మైక్రోసాఫ్ట్!

Posted By: Prashanth

సింహాసనం పై కన్నేసిన మైక్రోసాఫ్ట్!

 

ప్రపంచ నెం.1 స్థానం పై మైక్రోసాఫ్ట్ గురుపెట్టింది. వ్యూహరచనలో భాగంగా ఆపిల్ ఐప్యాడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సాఫ్ట్‌వేర్ గెయింట్ సన్నద్ధమవుతోంది. ప్రణాళికలో భాగంగా నేడు లాస్‌యాంగిల్స్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ వర్గాలు ‘విండోస్ ఆర్‌టీ’(ఆపరేటింగ్ సిస్టం) ఆధారిత టాబ్లెట్ పీసీలను ప్రకటించే అవకశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. విండోస్ ఆర్‌టీ అదేవిధంగా విండోస్ 8 టాబ్లెట్ పీసీల డవలెప్‌మెంట్‌కు సంబంధించి ఆది నుంచి మైక్రోసాఫ్ట్ గోప్యతను వహిస్తూవస్తోంది.

అసస్, ఏసర్ వంటి ఇతర బ్రాండ్‌లు వీండోస్ ఆర్‌టీ టాబ్లెట్ పీసీలను కంప్యూటెక్స్ 2012 ప్రదర్శనలో ఆవిష్కరించాయి. వీటన్నింటికి భిన్నంగా, మైక్రోసాఫ్ట్ ఆపిల్‌ను టార్గెట్ చేసుకుని వ్యూహాత్మకంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రకటించనున్నవిండోస్ ఆర్‌టి టాబ్లెట్ పీసీలు అత్యాధునిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు గుగూల్, అసస్ కాంభినేషన్ లో విడుదలవుతున్న గుగూల్ నెక్సస్ టాబ్లెట్ పీసీల పై భారీ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి.

ఈ జూన్ లోనే విండోస్ టాంగో!

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచాలనికి తెరలేపింది. సరికొత్త విండోస్ ఫోన్ టాంగో ఆపరేటింగ్ సిస్టంను ఈ జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోకి రానున్న టాంగో ఆపరేటింగ్ సిస్టం అత్యాధునిక ఫీచర్లను కలిగి యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. ఈ వోఎస్ తొలి ఎడిషన్‌ను చైనాలో లాంఛ్ చేస్తారు. తరువాత ఇతర దేశాల్లో ఉంటుంది. కాగా, విండోస్ ఫోన్ టాంగో అప్‌డేట్‌ను ఇప్పటికే వృద్థి చేసినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

విండోస్ ఫోన్ ట్యాంగో ఆధారితంగా పనిచేసే నోకియా లూమియా 610 ఫీచర్లు:

3.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

800 మెగాహెడ్జ్ సింగిల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

హై క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

3జీ కనెక్టువిటీ, ఎడ్జ్,

జీపీఆర్ఎస్, వై-ఫై,

బ్లూటూత్, జీపీఎస్,

యూఎస్బీ 2.0,

ఇంటర్నల్ మెమరీ 8జీబి,

ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),

బ్యాటరీ స్టాండ్ బై 580 గంటలు, ధర రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot