Home
News

మైక్రోసాఫ్ట్ చేతికి Linkedin

By Sivanjaneyulu

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ లింక్డ్‌ఇన్‌(LinkedIn)ను 26.2 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. లింక్డ్‌ఇన్‌ ప్రస్తుత సీఈఓగా జెఫ్‌ వీనర్‌ ఈ డీల్ పూర్తి అయిన తరువాత కూడా అదే స్థానంలో కొనసాగుతారు. ఈయన నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది. లింక్డ్‌ఇన్‌‌ను కొనుగోలు చేయటం ద్వారా మైక్రోసాఫ్ట్‌‌కు సోషల్ మీడియా రంగంలో మంచి పట్టుదొరికినట్లు అవుతుంది.

microsoft linkedin deal

Read More : లెనోవో కొత్త ఫోన్ 'Vibe K5' రూ.6,999కే

ఈ రెండు సంస్థలకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మధ్య సానుకూల వాతావరణంలో డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే డీల్‌ను క్లోజ్ చేసే అవకాశముంది. వ్యాపార ఆధారిత (బిజినెస్- ఓరియంటెడ్) సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ అయిన లింక్డ్‌ఇన్‌ను 2002లో ప్రారంభించారు. సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియలోని మౌంటేన్ వ్యూలో ఉంది.

microsoft linkedin deal

Read More : కొత్త ఫోన్‌ల పై ఆఫర్లే..ఆఫర్లు...

టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కంపెనీ కొనుగోలుకు సంబంధించి చర్చలు సాగుతూనే ఉంటాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్కైప్, టంబ్లర్, యూట్యూబ్, పేపాల్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు కొన్ని వందల కోట్లు గుమ్మరించి వీటిని సొంతం చేసుకున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్ల వివరాలను మీ ముందుంచుతున్నాం...

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, మోటరోలా మొబిలిటీని 12.5 బిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

ప్రముఖ ప్రింటింగ్ ఇంకా కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పీ, సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ అటానమీని 10.3 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ సర్వీసెస్‌ను 2011లో $8.5 బిలియన్‌లకు సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్, సన్ మైక్రోసిస్టమ్స్‌ను $7.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియాను $7.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, నెస్ట్ ల్యాబ్స్‌ను $3.2 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్, ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ క్విస్ట్ సాఫ్ట్‌వేర్‌ను $2.4 బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సెర్చ్ ఇంజన్ యాహూ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ టంబ్లర్‌ను $1.1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్లు

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను $1 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది.

Best Mobiles in India

English summary
Microsoft to buy LinkedIn for $26.2B in cash. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X