విండోస్ 10 మొబైల్ యూజర్లకు షాక్

By Gizbot Bureau
|

విండోస్ 10 మొబైల్ యూజర్లకు కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో పోటీతత్వం నెలకొన్న తరుణంలో మైక్రోసాఫ్ట్ కొన్ని విండోస్ ఫోన్లకు అధికారికంగా సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా 2010లో విండోస్ ఫోన్ 7 బ్యాక్ మార్కెట్లలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ వెర్షన్ విండోస్ 10 మొబైల్‌కు డెవలపర్స్ లేదా వినియోగదారుల నుంచి పెద్దగా ఆదరణ లేదు. దీనికి తోడు ఇప్పటికే విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయకపోవడంతో కంపెనీ అధికారికంగా సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

మైక్రోసాఫ్ట్ ఆఫీసు ష్యూట్
 

విండోస్ మొబైల్ తో ఎక్కువ మంది యూజర్లు ఎందుకు స్టిక్ అవుతున్నారంటే అందుకు పెద్ద కారణం మైక్రోసాఫ్ట్ ఆఫీసు ష్యూట్ అనే చెప్పాలి. ఇతర ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లతో పోలిస్తే ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్ వర్క్ వంటి యాప్స్ విండోస్ ఫోన్లో ఉన్నాయి.

జనవరి 12, 2021 వరకు

ఆఫీస్ యాప్స్ సంబంధించి అప్ డేట్స్, సెక్యూరిటీ పాచెస్ జనవరి 12, 2021 వరకు వస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇదివరకే ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కూడా విండోస్ మొబైల్ కు సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31, 2019 నుంచి విండోస్ మొబైల్స్ లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.

ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లకు

ఒకవేళ మీరు విండోస్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీరు వెంటనే ఏదైనా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లకు మారిపోవడం మంచిది. ఈ రెండు OSలకు టన్నుల కొద్ది అప్లికేషన్లకు సంబంధించి తమ యాప్ స్టోర్లలో నుంచి అప్ డేట్స్, సెక్యూరిటీ పాచెస్ రిలీజ్ అవుతునే ఉంటాయి.

చివరి అప్‌డేట్‌
 

కాగా 2015 నవంబర్‌లో మొదటిసారిగా విండోస్ 10 మొబైల్ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దెబ్బకు ఆ ఓఎస్ నిలబడలేకపోయింది. దీంతో 2017లో విండోస్ 10 మొబైల్ ఓఎస్ డెవలప్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇక ఇప్పుడు చివరి అప్‌డేట్‌ను ఆ ఓఎస్ కోసం మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. దీంతో ఆ మొబైల్స్ కథ ఇక ముగిసినట్లయింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Microsoft to end Windows 10 Mobile updates and support in December

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X