మైక్రోసాఫ్ట్, యాపిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా ?

|

టెక్ ప్రపంచం నివ్వెర పోయే సందర్భం వచ్చేసింది. టెక్ ప్రపంచంలో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న మైక్రోసాఫ్ట్,యాపిల్ లు ఇప్పుడు కలిసి ఓ పని చేయనున్నాయి. విండోస్ 10లో ఐ మెసేజ్ సపోర్ట్ ను తెచ్చేందుకు యాపిల్ సహాయం కోరనుంది మైక్రోసాఫ్ట్. ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ కు చెందిన శిల్పా రంగనాథన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఐమెసేజ్ సర్వీసు ద్వారా విండోస్ లో ఒక గౌరవ ప్రదమైన వాతావరణం తెచ్చేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే యూజర్స్ కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది.

 
మైక్రోసాఫ్ట్, యాపిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా ?

ఐమెసేజ్ సిస్టంను పలు మార్లు మైక్రోసాఫ్ట్ లో తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగినప్పటికీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అది పనిచేయలేదు. దీంతో ఐ మెసేజ్ సిస్టంను ఎలాగైనా విండోస్ లో ప్రవేశ పెట్టాలనే ఉద్దేశ్యంతో యాపిల్ తో కలిసేందుకు సిద్ధమవుతోంది మైక్రోసాఫ్ట్. ఐఓఎస్ లోని అత్యుత్తమ యాప్స్‌లో ఐ మెసేజ్ కూడా ఒకటి.

రీసెంట్ అప్డేడ్స్ ఎప్పటికప్పుడు అందించడంతో పాటు, ఈ యాప్ ఇంటర్ ఫేస్ కూడా పలు మన్ననలు అందుకుంది. అలాగే సెక్యూరిటీ విషయంలో ఎన్ క్రిప్షన్ విషయంలో ఇతర మేసేజింగ్ యాప్‌ల కన్నా ఐ మెసేజ్ ముందు వరుసలో నిలిచింది.

అంతేకాదు మైక్రో సాఫ్ట్ ఇటీవలే తమ డివైజ్ లలో ఎలాంటి మార్పులు చేయాలి అనే దానిపై సలహాలు సూచనలు పొందేందుకు యూవర్ ఫోన్ పేరిట అప్లికేషన్ ను రూపొందించింది. తద్వారా పీసీ రంగంలో రారాజుగా ఉన్న మైక్రోసాఫ్ట్, స్మార్ట్ ఫోన్ స్పేస్ లో కూడా రాణించే అవకాశం ఉంది. అంతే కాదు యూవర్ ఫోన్ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు, ఇతర మీడియా మెసేజీలు డైరక్టుగా మీ పీసీలో స్టోర్ చేసుకునే అవకాశం ఉంది.

క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి ఆపిల్ కంపెనీ !క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి ఆపిల్ కంపెనీ !

Best Mobiles in India

Read more about:
English summary
We might see iMessage working on a Windows 10 powered machine if Apple and Microsoft start working together for the ambitious project. Recently, Microsoft revealed “Your Phone" app that is designed to make iOS and Android devices work better with Windows 10 PCs. The app brings things such as photos, texts, and more directly from your smartphone to your Windows PC.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X