మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!! మీ విండోస్ PC సేఫ్ గా ఉండాలంటే ఈ అప్‌డేట్ ను వెంటనే చేయండి...

|

ప్రముఖ సాఫ్ట్ వెర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన యొక్క అన్ని రకాల విండోస్లను తమ సిస్టమ్‌లలో వాడుతున్న యూజర్లకు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్‌డేట్ చేయాలని కోరుకుంటుంది. గత వారం కొంతమంది పరిశోధకులు నివేదించిన ప్రింట్‌నైట్మేర్ సెక్యూరిటీ సమస్యను పరిష్కరించే దిశగా విండోస్ వినియోగదారుల కోసం ఈ టెక్ దిగ్గజం అత్యవసర సెక్యూరిటీ అప్ డేట్ ను తీసుకువచ్చింది. "మీరు ఈ అప్ డేట్ లను మీ సిస్టమ్‌లలో వెంటనే ఇన్‌స్టాల్ చేయాలని సిఫార్సు చేస్తున్నాము" అని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

సెక్యూరిటీ అప్ డేట్

జూలై 6 న విడుదల చేసిన సెక్యూరిటీ అప్ డేట్ "CVE-2021-1675" కు రక్షణ కల్పించడమే కాకుండా CVE-2021-34527 లో డాక్యుమెంట్ చేయబడిన 'ప్రింట్‌నైట్మేర్' అని పిలువబడే విండోస్ ప్రింట్ స్పూలర్ సర్వీసులో అదనపు రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ దోపిడీకి టెక్నాలజీ పరిజ్ఞానం ఉందని చెప్పారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Windows 11 ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? కొత్తధనం ఏమి ఉంది??Windows 11 ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? కొత్తధనం ఏమి ఉంది??

విండోస్ అప్ డేట్ లో: సమస్య ఏమిటి?

విండోస్ అప్ డేట్ లో: సమస్య ఏమిటి?

మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త విండోస్‌లో గత వారం పరిశోధకులు 'ప్రింట్‌నైట్‌మేర్' అనే ఒక బగ్ ను కనుగొన్నారు. ఇది మీ యొక్క సిస్టమ్‌లోని రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌ను ఇతరులు ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి, అడ్మిన్ పర్మిషన్లతో కొత్త అకౌంటులను సృష్టించడానికి వంటి మరెన్నో అనుమతిస్తుంది. ఈ కొత్త బగ్ చెడ్డ వ్యక్తుల యొక్క బిజినెస్ స్టేటస్ అధికారాలను అందిస్తుంది. ఇది అతి పెద్ద హ్యాకింగ్ సంఘటనకు దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు.

మీ పాత ల్యాప్‌టాప్ లేదా PCకి విండోస్ 11 మద్దతు ఇవ్వగలదా? రిక్విర్మెంట్స్ ఏంటి??మీ పాత ల్యాప్‌టాప్ లేదా PCకి విండోస్ 11 మద్దతు ఇవ్వగలదా? రిక్విర్మెంట్స్ ఏంటి??

మైక్రోసాఫ్ట్ విండోస్

మైక్రోసాఫ్ట్ విండోస్ అప్ డేట్ లో సమస్య హైలైట్ అయిన వెంటనే మైక్రోసాఫ్ట్ సంస్థ దానిని అంగీకరించి కూడా. "విండోస్ ప్రింట్ స్పూలర్ సర్వీస్ సక్రమంగా ప్రత్యేకమైన ఫైల్ ఆపరేషన్లను చేసినప్పుడు రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ దుర్బలత్వంను కలిగి ఉంది." దాడి చేయాలని భావించే వాడు ఈ దుర్బలత్వాన్ని విజయవంతంగా ఉపయోగించుకొని సిస్టమ్ అధికారాలతో ఏకపక్ష కోడ్‌ను అమలు చేయగలడు అని బగ్ ను కనుగొన్న పరిశోధకలు అన్నారు. అంతేకాకుండా దాడి చేసేవారు వినియోగదారుల యొక్క PC లలో వారికే తెలియకుండా ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేయవచ్చు, మార్పులను చేయవచ్చు లేదా డేటాను తొలగించవచ్చు లేదా పూర్తి వినియోగదారుడి యొక్క పర్మిషన్ లతో కొత్తగా ఏదైనా అకౌంటును సృష్టించవచ్చు అని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ లోపాన్ని పరిష్కరిస్తుంది

మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ లోపాన్ని పరిష్కరిస్తుంది

మైక్రోసాఫ్ట్ సంస్థ తన యొక్క సెక్యూరిటీ లోపాన్ని కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌తో సమస్యను పరిష్కరించుకుంది. మీరు విండో వినియోగదారు అయితే కనుక మీ సిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా మీ యొక్క PC లో అప్ డేట్ ను వెంటనే ఇన్‌స్టాల్ చేయండి. మైక్రోసాఫ్ట్ యొక్క అన్ని విండోస్ వెర్షన్లు హానిని కలిగి ఉన్నాయి కావున మీరు వెంటనే కొత్త అప్ డేట్ ను ఇన్‌స్టాల్ చేయాలని కంపెనీ స్పష్టం చేసింది.

సెక్యూరిటీ అప్ డేట్

మీకు సెక్యూరిటీ అప్ డేట్ లభించకపోతే కనుక మీరు మరికొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది. జూలై 6 న సెక్యూరిటీ అప్ డేట్ లు అందుబాటులో లేని విండోస్ యొక్క మద్దతు ఉన్న సంస్కరణలు జూలై 6 తర్వాత అప్ డేట్ చేయబడతాయి అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

మైక్రోసాఫ్ట్

"జూలై 6, 2021 న మరియు తరువాత విడుదల చేసిన సెక్యూరిటీ అప్ డేట్ లలో విండోస్ ప్రింట్ స్పూలర్ సర్వీసులలో "ప్రింట్ నైట్మేర్" అని పిలువబడే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ దోపిడీకి రక్షణలు ఉన్నాయి. ఇది CVE-2021-34527 లో మరియు CVE-2021- 1675 లో డాక్యుమెంట్ చేయబడింది అని మైక్రోసాఫ్ట్ వివరించింది."

Best Mobiles in India

English summary
Microsoft Warning !! Do This Update Right Away to keep Your Windows PC Safe

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X