సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

Posted By:

విండోస్ 8కు తరువాతి వర్షన్‌గా మైక్రోసాప్ట్ ఇటీవల ప్రదర్శించిన విండోస్ 10 ఓఎస్ కొత్త అనుభూతులతో మరికొద్ది రోజుల్లో మనముందుకు రాబోతోంది. ఎట్టకేలకు తన విండోస్ 10 ప్రివ్యూను బుధవారం మైక్రోసాఫ్ట్ తన రెడ్మండ్ కార్యాలయంలో ప్రదర్శించింది. ఒక్క మాటలో చెప్పాలంటే విండోస్ 10 అన్ని డివైస్‌లకు ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

విండోస్ 10 కోసం రూపొందించిన యాప్స్ డెస్క్‌టాప్, ఫోన్, ఎక్స్‌బాక్స్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల పైనా పనిచేస్తాయి. విండోస్ 8 వర్షన్‌లో కోల్పొయిన స్మార్ట్ మెనూను విండోస్ 10 వర్షన్‌లో మైక్రోసాఫ్ట్ తిరిగి ప్రవేశపెట్టింది. విండోస్ 10లో స్పార్టాన్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. తక్కువ స్పేస్‌‌ను మాత్రమే ఆక్రమించే స్పార్టాన్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ తరహాలో వేగవంతంగా స్పందించగలదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో రారాజుగా కొనసాగిస్తోన్న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 రాకతో మొబైల్ ఓఎస్‌ల విభాగంలోనూ పుంజుకోవాలిని చూస్తోంది. విండోస్ 10 ఓఎస్ మొబైల్ వర్షన్ ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉండే అవకాశముంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 గురంచి  పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

విండోస్ 10 అన్ని ఫోన్‌లలోనూ రన్ అవుతుంది.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

కార్టోనా పేరుతో వాయిస్ అసెస్టెంట్ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10లో ఏర్పాటు చేసింది. యాపిల్ సిరి తరహాలో స్పందించే ఈ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ మనమడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

స్పార్టాన్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10లో పొందుపరిచింది. ఈ బ్రౌజర్ వేగవంతమైన బ్రౌజింగ్‌ను చేయగలదని మైక్రోసాఫ్ట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

విండోస్ 8లో కోల్పొయిన స్టార్ట్ మెనూను తిరిగి విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ పొందపరించింది. లైవ్ టైల్స్ తో ఈ ఫీచర్ మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1 యూజర్లు విండోస్ 10 ఓఎస్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అప్‌గ్రేడ్ కావొచ్చు.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

విండోస్ 10 యూజర్లు ఎక్స్‌బాక్స్ గేమింగ్ డివైస్‌‌ను సునాయాసంగా తమ డివైస్‌లలో రన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన యాప్‌‌ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ హబ్ 84 అంగుళాల ఆల్ ఇన్ వన్ కంప్యూటర్

సరికొత్త అనుభూతులతో విండోస్ 10 రెడీ...

విండోస్ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft Windows 10 event recap: see all the announcements.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot