విండోస్ 8 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

Posted By: Prashanth

విండోస్ 8 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!

 

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం ముందస్తు బుకింగ్‌లను శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ వోఎస్‌కు సంబంధించి పూర్తి వర్షన్ డీవీడీ ప్యాక్‌ను కోరుకునే వారు $70 (రూ.3704) చెల్లించాల్సి ఉంటుంది. మరో ఆఫర్‌లో భాగంగా విండోస్ 8 విడుదల అనంతరం యూజర్ $40 (రూ.2116) చెల్లించి నేరుగా ఆన్‌లైన్ ద్వారా వోఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ కల్పిస్తోంది. ఈ ఆఫర్ కాలపరిమితి జనవరి చివరి వరకు మాత్రమేనని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దుకాణదారులు విండోస్ 8 సాఫ్ట్‌వేర్ ప్యాక్‌ను మైక్రోసాఫ్ట్ సొంత స్టోర్‌లైన ఆమోజన్ డాట్‌కామ్, బెస్ట్ బుయ్ డాట్‌కామ్‌ల ద్వారా $200 (రూ.10584) చెల్లించి సొంతం చేసుకోవచ్చు. జూన్ 2 తరువాత నుంచి విండోస్ పీసీలను కొనుగోలు చేస్తున్న వారికి $15(రూ.793) చెల్లించి విండోస్ 8 ప్రోకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ కల్పిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot