కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు మిడ్‌రేంజ్ ఫోన్ బెస్ట్!! ఎందుకో తెలుసా??

|

వినియోగదారులు తమ కంప్యూటర్లు / ల్యాప్‌టాప్‌లలో చేయగలిగే దాదాపు ప్రతిదీ ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ గత దశాబ్దంలో చాలాసార్లు మెరుగుపడింది. టెక్ పరిశ్రమలో స్పష్టంగా కనిపించే విషయానికి వస్తే మార్కెట్లో పోటీతో పాటు టెక్ యొక్క స్థాయి మరియు లభ్యత పెరుగుతున్నప్పుడు ధరలు తగ్గుతాయి.

 

మిడ్‌రేంజ్ ఫోన్‌

ఇప్పుడు మిడ్‌రేంజ్ ఫోన్‌ యొక్క విషయానికి వస్తే ఇది 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వాటి కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి . ప్రస్తుతం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు అన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఫ్లాగ్‌షిప్‌ విభాగంలో పొందే దాదాపు ప్రతిదాన్ని ఇప్పుడు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో కలిగి ఉన్నారు. ఫ్లాగ్‌షిప్‌కు బదులుగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎందుకు కొనుగోలు చేయాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బడ్జెట్ ధరలో రెడ్‌మి మొదటి 5G ఫోన్ నోట్ 10T 5G లాంచ్!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండిబడ్జెట్ ధరలో రెడ్‌మి మొదటి 5G ఫోన్ నోట్ 10T 5G లాంచ్!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి

మిడ్‌రేంజ్ ఫోన్‌లు ఉత్తమంగా ఉండడానికి కారణాలు
 

మిడ్‌రేంజ్ ఫోన్‌లు ఉత్తమంగా ఉండడానికి కారణాలు

మిడ్‌రేంజ్ ఫోన్‌లు మెరుగ్గా ఉండడానికి గల మొదటి కారణం వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్. ఈ రోజు మిడ్‌రేంజ్ ఫోన్‌తో అన్ని రకాల గేమ్ లను ఆడవచ్చు, గొప్ప ఫోటోలను క్లిక్ చేయవచ్చు, వీడియోలను సవరించవచ్చు, 5G కనెక్టివిటీని కూడా ఉపయోగించవచ్చు. వీటి కోసం తగినంత శక్తివంతమైన ప్రాసెసర్‌లతో పాటు అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలను పొందవచ్చు. ఫోటోలు ఫ్లాగ్‌షిప్ డివైస్ అందించేంత గొప్పవి కాకపోవచ్చు కానీ మిడ్‌రేంజ్ ఫోన్‌తో మీకు తగినంత మెరుగైన కలర్ లతో ఫోటోలు లభిస్తాయి. ఇవి మీకు సంతోషంగా కూడా ఉంటుంది.

Google సెర్చ్ యొక్క చివరి 15 నిమిషాల హిస్టరీను ఒకే క్లిక్‌తో తొలగించవచ్చు!! ఎలాగో తెలుసా??Google సెర్చ్ యొక్క చివరి 15 నిమిషాల హిస్టరీను ఒకే క్లిక్‌తో తొలగించవచ్చు!! ఎలాగో తెలుసా??

రెండవ కారణం

రెండవ కారణం ధరల విభాగం. మిడ్‌రేంజ్ ఫోన్‌ల యొక్క ధరలు రూ.20,000 నుంచి రూ.30 వేల మధ్య ఉంటాయి. అయితే ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ల ధరలు రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. మీకు అవసరం లేని దేనికోసం మీ డబ్బును ఖర్చు చేయకపోవడం అనేది తెలివైనవాడి యొక్క గొప్ప గుణం. మిడ్‌రేంజ్ ఫోన్‌లు మరియు ఫ్లాగ్‌షిప్‌ల ఫోన్‌ల మధ్య వ్యత్యాసం మొత్తంతో మీకు అవసరమైన వస్తువులపై ఖర్చు చేయడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుందని నిర్ధారించుకొండి.

మూడవ కారణం

మూడవ కారణం స్మార్ట్‌ఫోన్‌లు అనేవి వేగంగా పాతవి కావడం మరియు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పటికప్పుడు విడుదల కావడం. ఉదాహరణకు ఈ రోజు మీరు తాజా ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండవచ్చు. అయితే త్వరలోనే ఆపిల్ మరొక క్రొత్త పరికరంతో మార్కెట్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మీరు ఎక్కువ మొత్తం డబ్బును చెల్లించి కొనుగోలు చేసిన మీ ఐఫోన్ మార్కెట్ నాయకుడిగా ఉండకపోవచ్చు. ఇది అప్పుడు మీకు కొద్దిగా విచారకరంగా ఉంటుంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ Vs మిడ్‌రేంజ్ ఫోన్‌

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ Vs మిడ్‌రేంజ్ ఫోన్‌

పైన తెలిపిన కారణాల కారణంగా మీరు వన్‌ప్లస్ 9 ప్రో వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే మీకు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్ డేట్ లు మాత్రమే లభిస్తాయని గమనించండి. అందువల్ల మీరు మరింత ఎక్కువ విలువైనది కానటువంటి సరికొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ పొందడానికి మరో స్మార్ట్‌ఫోన్‌లో రెండేళ్ల తర్వాత మళ్లీ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మిడ్‌రేంజ్

అయితే మీరు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి ఉంటే అది పాతది అయితే కనుక మీ మనస్సుపై ఎక్కువ భారం పడకుండా దాన్ని సులభంగా మార్చవచ్చు. ఇంకా ఆండ్రాయిడ్ అప్‌డేట్ల కోసం మీరు మీ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మరొకదానితో మార్పిడి కూడా చేసుకోవచ్చు. మీరు ఎల్లప్పుడూ సరికొత్త ఆండ్రాయిడ్ బిల్డ్‌ను నడుపుతున్నారని నిర్ధారించుకోండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Midrange Phone is Best For Buying a New Smartphone !! Do You know Why?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X