మార్కెట్లోకి ఇంటిని శుభ్రం చేసే రోబోట్

Posted By:

ఇంటితో పాటు తడి ఫ్లోర్‌లను శుభ్రం చేసే క్లీనింగ్ రోబోట్లు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ దేశవాళీ రోబోట్ల తయారీ కంపెనీ మిలాగ్రో హ్యుమన్‌టెక్ ‘Aguabot 4.0' పేరుతో సరికొత్త రోబోట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అడ్వాన్సుడ్ మోపింగ్ సిస్టంతో వచ్చే ఈ రోబోట్ చిన్నపాటి వాటర్ ట్యాంకులను కూడా క్లీన్ చేసేస్తుంది.

 మార్కెట్లోకి ఇంటిని శుభ్రం చేసే రోబోట్

రోబోటిక్ సిక్స్త్ సెన్స్, పవర్ సక్షన్, ఆటోమెటేడ్ సక్షన్, పవర్ కంట్రోల్, యూవీ రేడియేషన్ క్లీనింగ్, ఆటోమెటిక్ అబ్‌స్టాకిల్, ఫాల్ డిటెక్షన్, హై ఎఫీషియన్సీ పర్టికులేట్ ఎయిర్ ఫిల్టర్, ఆల్-సర్ఫేస్ క్లీనింగ్ వంటి ప్రత్యేకతలను ఈ రోబోట్‌లో పొందుపరిపచారు.

రిమోట్ కంట్రోల్ ఆధారంగా స్పందించే ఈ రోబోట్ సింగిల్ చార్జ్ పై 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్‌ను శుభ్రం చేసేస్తుంది. పూర్తిగా చార్జ్ చేయబడిన రోబోట్ 120 నిమిషాల పాటు ఏకథాటిగా పనిచేయగలదు. ముఖ్యంగా నగరాల్లో నివశిస్తున్న వారికి ఈ రోబోట్ మరింత ఉపయోగకారిగా నిలవనుంది. ధర రూ.29,990.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

ఈ రోబోట్ మీ ఇంటిని చకాచకా శుభ్రం చేసేస్తుంది. చాలా దేశాల్లో ఈ రోబోట్ అందుబాటులో ఉంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

గట్టర్ క్లీనర్ ఈ గట్టర్ క్లీనర్ రోబోట్ ఇంటి మూలన ఉన్న చెత్తను సులవుగా క్లీన్ చేసేస్తుంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

ఈ రోబోట్‌లు స్విమ్మింగ్ ఫూల్స్‌ను సమర్థవంతంగా శుభ్రం చేసేస్తాయి.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

 వాక్యుమ్ క్లీనర్ తరహాలో ఉండే ఈ విండో క్లీనింగ్ రోబోట్ మీ ఇంటి కిటికీలను సలువుగా క్లీన్ చేసేస్తుంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

 ఈ రోబోట్ మీ ఇంట్లో ఉంటే వేరొక పార్టనర్ అవసరలేకంగానే పింగ్ పాంగ్ గేమ్‌ను ఆడేయవచ్చు.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

 ఈ రోబోటిక్ లాన్‌మూవర్ మీ పెరటిని ఎప్పటికప్పుడు చదునుగా ఉంచుతుంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

 ఈ టెలీప్రెసెన్స్ రోబోట్లు మీ ఇంటి సెక్యూరిటీ స్థాయిని మరింతగా బోలోపేతం చేస్తాయి. రెండు వేరియంట్‌లలో అందబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్‌సీడీతో మరొకటి ఎల్‌సీడీ లేకుండా.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

ఈ హోమ్ సెక్యూరిటీ రోబోట్స్ మీ ఇంటికి కాపలాగా ఉంటాయి. మీరు లేని సమయంలో ఇంట్లోకి అనుమానిత వ్యక్తులు చొరబడినట్లయితే ఇంటిని రిమోట్ కంట్రలో ఆధారంగా లాక్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందిస్తుంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

ఈ రోబో క్లాక్ చాలా తెలివైనది. నిర్థేశిత సమయానికి మిమ్మల్ని ఓసారి మేలుకొల్పుతుంది. అప్పటికి మీరు నిద్రమత్తులో ఉన్నట్లయితే ఈ రోబో క్లాక్ శబ్థాన్ని మరింతగా పెంచి ఇంట్లో ఏదో ఒక మూలకు దూరేస్తోంది. అప్పుడు మీరు ఈ రోబో క్లాక్‌ను మీరు వెతికి మరి ఆఫ్ చేయవల్సి ఉంటుంది.

ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

ఈ రోబోట్లు వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందిస్తూ చిన్నచిన్న పనులను చకచకా కానిచ్చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Milagrow Robot That can Clean Wet Floors, Available now in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot