సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
100 మిలియన్‌లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్‌లతో కళకళలాడుతున్న ఫోటో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్'కు గొప్ప చరిత్రే ఉంది. ఈ వెబ్‌సైట్‌ను తొలిగా అక్టోబర్‌లో 2010లో ప్రారంభించారు. ఈ ఫోటోషేరింగ్ అప్లికేషన్ ద్వారా మీరు చిత్రీకరించిన ఫోటోలను బంధుమిత్రులతో పంచుకోవచ్చు. 2013కు గాను ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఫోటోషేరింగ్ అప్లికేషన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌ను అత్యధిక మంది వినియోగించుకుంటున్నారు.
సాధారణంగా మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించిన ఫోటోలు దీర్ఘచతురస్రాకరంలో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ ఫోటోలను చతురస్రాకారంలోకి మార్చేస్తుంది. తరువాతి క్రమంలో ఫోటోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. కెవిన్ సిస్ట్రోమ్, మైకేల్ క్రీగర్ అనే ఇద్దరు యువ సాంకేతిక నిపుణులు స్థాపించిన ఈ కంపెనీ తన తొలి అప్లికేషన్‌ను యాపిల్ ఐస్టోర్ ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చింది. విపణిలోకి వచ్చిన 3నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న పలు ‘ఇన్‌స్టాగ్రామ్' ఫోటోలను ఇప్పుడు చూద్దాం....

సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
1.) ఇన్‌స్టాగ్రామ్‌లో లోడ్ చేసిన తొలి ఫోటో ఇదే. కెనిన్ సిస్ట్రోమ్ తన మెక్సికన్ విహార యాత్రలో భాగంగా ఈ ఫోటోను చిత్రీకరించటం జరిగింది.

సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
2.) అంటార్కిటికాలోని ఓ పెంగ్విన్ ఫోటోలకు ఇలా ఫోజులిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లోడ్ చేసిన ఈ ఫోటోకు మంచి ఆదరణ లభించింది.

సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
3.) ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోతోనే (#) ట్యాగ్‌ను ఉపయోగించిటం ప్రారంభమైంది. #shoesfes.

సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
4.) కెనడా ప్రాంతానికి చెందిన వ్యోమగామి క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ అంతరిక్షం కేంద్రం నుంచి ఈ ఫోటోను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం జరిగింది.

సోషల్ నెట్‌వర్క్ విభాగంలో ఎగబాకిన కెరటం ‘ఇన్‌స్టాగ్రామ్’
5.) ఫోన్ నుంచి తొలిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఫోటో ఇదే.


Click it and Unblock the Notifications








