ప్రమాదంలో లక్షల లెనోవో ఫోన్‌లు!

లక్షలో సంఖ్యలో లెనోవో స్మార్ట్‌పోన్‌లు ప్రమాదంలో చిక్కకున్నట్లు తెలుస్తోంది. లెనోవో సహా 43 ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో చైనాకు చెందిన Adups అనే ప్రమాదకర సాఫ్ట్‌వేర్ రహస్యంగా చొరబడినట్లు సెక్యూరిటీ సంస్థలు క్రిప్టోవైర్, ట్రస్ట్‌లుక్‌లు వెల్లడించాయి.

 ప్రమాదంలో లక్షల లెనోవో ఫోన్‌లు!

Read More : USB Type-C ప్రత్యేకతలేంటి..?

ఈ స్పై‌వేర్ ఇన్‌స్టాల్ అయిన ఫోన్‌లలో యూజర్‌కు తెలియకుండానే లోకేషన్, కాల్ లిస్ట్, కాంటాక్ట్స్, యాప్ డేటా, టెక్స్టింగ్ వంటి కీలక వివరాలు ప్రతి 72 గంటలకు చైనాలోని గుర్తుతెలియని సర్వర్‌కు రహస్యంగా చేరవేయబడుతున్నట్లు ఈ సంస్థలు హెచ్చరికలు జారీ చేసాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ప్రమాదంలో లక్షల లెనోవో ఫోన్‌లు!

దాదాపు 70 కోట్ల ఫోన్లలో ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందని, అమెరికాలో 1.2 లక్షల ఫోన్లలో ఈ సాఫ్ట్‌వేర్ ఉందని 'క్రిప్టోవైర్' పేర్కొంది. ఈ సమాచారం చైనా ప్రభుత్వానికి చేరుతోందా? లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై బ్లూ ప్రతినిధికి చెందిన ఉద్యోగి ఒకరు స్పందిస్తూ, తమ ఫోన్లలోని అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను తొలగిస్తున్నట్టు వెల్లడించారు.

Read More : ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?

English summary
Millions Of Android Phones By Lenovo And Others Running Spyware Apps. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot