అమెరికాను శాసించేంత డబ్బు..?

అంతర్జాతీయంగా యాపిల్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులంటే ప్రత్యేకమైన క్రేజ్. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో యాపిల్ ఐఫోన్‌లు, టాబ్లెట్ పీసీల విభాగంలో యాపిల్ ఐప్యాడ్‌లు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ విభాగంలో యాపిల్ ఐపోడ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో యాపిల్ మ్యాక్ పీసీలు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికాను శాసించేంత డబ్బు..?

Read More : ఇక మీ ఫోనే మీ డ్రైవింగ్ లైసెన్స్!

అయితే, గేమింగ్ విభాగంలోనూ యాపిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది.యాపిల్ కంపెనీ తయారు చేసిన ఓ గేమింగ్ కన్సోల్ యాపిల్ చరిత్రలోనే ఓ పీడకలగా నిలిచింది. యాపిల్ కంపెనీ గురించి 20 ఆసక్తికర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

యాపల్ వద్ద 206 బలియన్ డాలర్ల నగదు క్యాష్ రూపంలో ఉంది.ఈ మొత్తాన్న అమెరికా జనాభాకు పంచింతే ఒక్కొక్కరికి 651 డాలర్లు వస్తుంది. ఈ డబ్బుతో 16జీబి ఐఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

#2

యాపిల్ వద్ద ఉన్న డబ్బులతో 3,169 Gulfstream G650s విమానాలను కొనుగోలు చేయవచ్చు.

#3

2014 ఆర్థిక సంవత్సరంలో యాపల్ లాభం $39.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లాభంతో స్నాప్‌చాట్, పింట్రస్ట్, ఎయిర్‌బీఎన్‌బి వంటి సంస్థలను కొనుగోలు చేయవచ్చు.

#4

అమెరికా ట్రజరీల ఉన్న డబ్బుకంటే యాపిల్ కంపెనీ వద్ద ఉన్న డబ్బే ఎక్కువ.

#5

యాపిల్ కంపెనీని ముగ్గురు వ్యక్తులు స్థాపించారు. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నైక్, రోనాల్డ్ వేన్. నెలకొల్పిన 12 సంవత్సరాల తరువాత రోనాల్డ్ వేన్ తన 10 శాతం వాటాతో కంపెనీ నుంచి తప్పుకున్నాడు.

#6

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 92,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు.

#7

యాపిల్ కంప్యూటర్ల దగ్గర స్మోక్ చేస్తే ఆ ఉత్పత్తులకు వారంటీ వర్తించదట!.

#8

యాపిల్ కంపెనీ విడుదల చేసే ప్రతి ఐఫోన్ ఫోటోగ్రాఫ్‌లో సమయాన్ని 9:41 AMగా చూపుతారు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మొట్ట మొదటి యాపిల్ ఐఫోన్‌ను ఆవిష్కరించింది ఆ సమయంలోనే.

#9

ఐపోడ్ రూపకర్త టోనీ ఫాడెల్ తన డివైస్‌ను తొలత ఫిలిప్స్ అలానే రియల్ నెట్‌వర్క్స్‌కు ఆఫర్ చేసారు. అయితే వాళ్లు ఆ ఉత్పత్తిని తిరస్కరించారు.

#10

ఐఫోన్‌ను తయారు చేయాలనే ఆలోచన యాపిల్‌కు 1991లోనే వచ్చివుంటే ఒక్క ఫోన్‌ను తయారు చేయటానికి దాదాపు 3 మిలియన్ డాలర్లు ఖర్చై ఉండేదట. ఒక్క ర్యామ్ కోసమే 1.44మిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చేదట.

#11

స్టీవ్ జాబ్స్ పండ్లను ఇష్టపడతారు. కాబట్టే యాపిల్ కంపెనీకి యాపిల్ అనే పేరు వచ్చింది

#12

యాపిల్ కంపెనీని ప్రారంభించిన రోజు ఏప్రిల్ 1, 1976, యాపిల్ తన మొదటి కంప్యూటర్ యాపిల్1ని విడుదల చేసిన రోజు జూలై 1976,
యాపిల్ మొదటి ఐపోడ్ విడుదలైన రోజు నవంబర్ 10, 2001,
యాపిల్ మొదటి ఐఫోన్ విడుదలైన రోజు జూన్ 29, 2007,
యాపిల్ మొదటి ఐప్యాడ్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2010

#13

సెప్టంబర్ 2013 నాటికి అమ్ముడైన యాపిల్ ఐఓఎస్ డివైజుల సంఖ్య 700 మిలియన్లు,

#14

అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 39 శాతం.

#15

యాపిల్ ఐట్యూన్స్ ఫీచర్‌ను చురుకుగా వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 500 మిలియన్లు. యాపిల్ ఐక్లౌడ్ ఫీచర్ను వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 300 మిలియన్లు.

#16

యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌ల సంఖ్య 50 బిలియన్లు.  ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800,  

#17

ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల కాలంలో డౌన్లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్‌ల సంఖ్య 2 బిలియన్లు, యాపిల్ అప్లికేషన్ డెవలపర్లకు యాపిల్ చెల్లించిన మొత్తం $10బిలియన్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
mind-blowing facts about Apple that show just how massive the company really is. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot