ఫేస్‌బుక్: అమ్మానాన్న వద్దన్నారు..సూసైడ్ చేసుకుంది!

Posted By:

ఆధునిక కమ్యూనికేషన్ సంబంధాలు నేటియువత మానసిక స్థితిగతుల పై ఏ విధమైన ప్రభావాలు చూపుతున్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఫేస్‌బుక్ వినియోగించరాదని తల్లిదండ్రులు హుకం జారీచేయటంతో మనస్తాపానికి గురైనమహారాష్ట్రాకు చెందిన 17 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్: అమ్మానాన్న వద్దన్నారు..సూసైడ్ చేసుకుంది!

పోలీసుల దర్యాప్తులో భాగంగా వెల్లడైన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాకు చెందిన ఐశ్వర్య ఎస్ దహివాలా అనే 17ఏళ్ల యువతి మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులతో ఫేస్‌బుక్ వినియోగం విషయమై గొడవ పడింది. సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లను ఉపయోగించరాదని సదరు బాలికను తల్లిదండ్రులు హెచ్చరించటం జరిగింది.

ఈ వ్యవహారం పై తీవ్రంగా కలత చెందిన ఐశ్యర్య తన మరణానికి గల కారణాలను సూసైడ్ నోట్ పై రాసి ఆత్మహత్యకు పాల్పిడినట్లు కేసు విచారణాధికారి లెంగూడే తెలిపారు. సూసైడ్ నోట్‌లో భాగంగా ఐశ్వర్య తన తల్లిందండ్రుల పై అనేక ఆరోపణులు చేసింది. తనను ఫేస్‌బుక్ ఉపయోగించకుండా తన తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పేవారని, తనపై ఇలాంటి ఆంక్షలు పెట్టే ఇంట్లో ఉండలేనని, ఫేస్‌బుక్ లేకుండా జీవించలేనని ఐశ్వర్య తన సూసైట్ నోట్‌లో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting