పాకిస్తాన్ ను చిత్తు చేసిన ఇండియన్ మిరాజ్-2000 పవర్ తెలుసుకోండి
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.ఈ దాడిలో మిరాజ్-2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించడంతో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ యుద్ధ విమానాల గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇవి భారత దేశానికి కీలకంగా వ్యవహరించాయి.

మిరాజ్-2000
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ మిరాజ్-2000ను తయారు చేసింది.1970లలో తొలిసారిగా మిరాజ్ తయారై ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌లో సేవలు అందిస్తోంది.

మిరాజ్-2000
మిరాజ్-2000 సింగిల్ సీటర్, టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి. ఈ విమానంలో తొమ్మిది చోట్లకు ఆయుధాలను తీసుకెళ్లవచ్చు.

మిరాజ్-2000
ఎంబీడీఏ బీజీఎల్ 1000 లేజర్ గైడెడ్ బాంబు, ఎంబీడీఏ ఏఎస్30ఎల్, ఎంబీడీఏ ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, ఎంబీడీఏ ఏఎం39 ఎక్సోసెట్ యాంటీ షిప్ మిస్సైల్, ఎంబీడీఏ రాకెట్ లాంఛర్లు, ఎంబీడీఏ ఆపాచీ స్టాండ్ ఆఫ్ వంటి ఆయుధాలని మోసుకెళ్తుంది.

మిరాజ్-2000
గంటకు 2,795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో ఇది మోస్ట్ స్పెషలిస్ట్

మిరాజ్-2000
ఒక్క నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్-2000 యుద్ధ విమానానికి ఉంది.


Click it and Unblock the Notifications