రూ. కోటి విలువ గల షియోమి ఫోన్లు మాయం, కంపెనీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ లో షియోమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ కంపెనీ ఫోన్లు మార్గం మధ్యలోనే మాయమయ్యాయి. షియోమి ఫోన్లను తీసుకుని బయలుదేరిన లారీని మార్గం మధ్యలోనే ఎవరో లూటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో షియోమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ కంపెనీ ఫోన్లు మార్గం మధ్యలోనే మాయమయ్యాయి. షియోమి ఫోన్లను తీసుకుని బయలుదేరిన లారీని మార్గం మధ్యలోనే ఎవరో లూటీ చేశారు. ఈ ఫోన్ల విలువ సుమారుగా కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల దగదర్తి గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటి నుండి కలకత్తాకు కోటి రూపాయల విలువ గల షియోమి ఫోన్లను ఓ లారీ ట్రక్ లో వేసుకుని డ్రైవర్ బయలు దేరగా అవి మార్గం మధ్యలోనే మాయమయ్యాయి. అయితే ఇందులో ఎవరి ప్రమేయం ఉందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కంటైనర్ లారీ
కంటైనర్ లారీ చెన్నై - కలకత్తా జాతీయ రహదారిపై వెళుతుండగా... నెల్లూరు జిల్లా దగదర్తి క్రాస్ రోడ్డు సమీపంలో దుండగలు అటకాయించారు. డ్రైవర్ ని చితకబాది పక్కనే ఉండే అడవిలో పడేశారు. ఆపై సెల్ ఫోన్ల పెట్టెలని వారి వెంట తెచ్చుకున్న లారీలో లోడ్ చేసుకుని పరారయ్యారు.

రూ.4.79 కోట్ల విలువగల 4,340 సెల్‌ఫోన్లు
అందులోని రూ.4.79 కోట్ల విలువగల 4,340 సెల్‌ఫోన్లు ఉన్నాయి . నెల్లూరులోని శ్రీసిటీ సెజ్ నుంచి రెడ్‌మీ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్లతో మినీ కంటెయినర్ లారీ కోల్‌కతాకు బయలుదేరింది. కొడవలూరు మండలంలోని గమేషా కంపెనీ వద్ద గుర్తుతెలియని కారు లారీకి అడ్డుగా వచ్చి ఆగిపోయింది.

మరో రెండు మినీ లారీలు
మరో రెండు మినీ లారీలు కంటెయినర్ లారీకి రెండువైపులా ఆగిపోయాయి. డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ లారీని రివర్స్ తీసేందుకు ప్రయత్నించగా మరో కారు లారీ వెనుక ఆగింది.ఇంతియాజ్ లారీ డోర్లు లాక్ చేసుకోగా, ఐదుగురు వ్యక్తులు ఆ డోర్ అద్దాలను పగలగొట్టి అతనిపై దాడిచేశారు. హైవే వెంబడి దగదర్తిలోకి ప్రవేశించారు.

చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి
అక్కడ లారీ ఆపి ఇంతియాజ్ చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి ఓ కారులో తిప్పారు. కంటెయినర్ లారీలో ఉన్న మొబైళ్లను రెండు లారీల్లోకి లోడ్ చేసుకుని పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కాగా ఖాళీ లారీని కావలి మండలంలోని గౌరవరం జాతీయ రహదారిపై దుండగులు వదిలి పెట్టారు. చెట్టుకట్టేసిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు దగదర్తి ఎస్సై అంకమ్మ తెలిపారు.


Click it and Unblock the Notifications








