21ఏళ్ల క్రితం అదృశ్యం....ఇప్పుడు ఇంజనీర్‌గా ఇంటికి రాక

By Super
|
21ఏళ్ల క్రితం అదృశ్యం....ఇప్పుడు ఇంజనీర్‌గా ఇంటికి రాక
ఒరిస్సా రాష్ట్రంలో అంధియా అనే గ్రామం. ఆ గ్రామంలో ఈరోజు ఓ అద్బుతమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఏమిటా ఆసంఘటన అని అనుకుంటున్నారా.. ఇంజనీరింగ్ చదువుకోవడానికి గదదర్ అనే యువకుడు దగ్గరలో ఉన్నటువంటి బుర్లా అనే సిటీకి వెళ్శడం అక్కడనుండి ఏమైందో ఏమోగాని అతను తప్పిపోయి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మరలా ఆ గ్రామానికి చేరుకోవడం ఆగ్రామంలో సంతోషాల్ని నింపాయి. గదదర్ ఒరిస్సా రాష్ట్రంలో జనాస్ అనే కులానికి సంబంధించిన యువకుడు.

ఇక వివరాలలోకి వెళితే గదదర్ మిస్ అయిన ఈఇరవై సంవత్సరాల కాలంలో అతని కుటుంబం అతని కోసం గాలిస్తునే ఉన్నారు. గదదర్ తన గ్రామం నుండి ఆగస్టు 1989లో ఇంజనీరింగ్ చదవడం కోసం బుర్లా అనే సిటీకి రావడం జరిగింది. ఈ ఇరవై సంవత్సరాలలో గదదర్ చాలా మారిపోయాడు. ఐతే అతని అదృష్టం ఏమిటంటే తన సోదరుడు ఇంటికి రాగానే అతనిని గుర్తుపట్టడం, తిరిగి వారియొక్క కుటుంబంలో చేర్చుకోవడం జరిగింది.

 

ఈ సందర్బంలో గదదర్ సోదరుడు మాట్లాడుతూ మా తమ్ముడుని మేము ఇంజనీరింగ్ చదువుల కోసం బుర్లా పంపించడం జరిగింది. అంతేకాకుండా అతనిని మాకుటుంబం నుండి పైచదువులు చదివించాలని అనుకున్నాం అని అన్నారు. కానీ అతను సడన్‌గా బుర్లా నుండి మాయమవడం జరిగింది. ఏది ఐతేనేం మా తమ్ముడు తిరిగి మాదగ్గరకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరోక విశేషం ఏమిటంటే మా తమ్ముడు ఇంతవరకు పెళ్శి చేసుకోలేదు.

అసలు గదదర్ మాయమవడానికి కారణాలు ఏమైఉంటాయబ్బా..అని అలోచిస్తే గదదర్ చదువుకునే రోజుల్లో వాళ్శ అమ్మ నాన్నలు గదదర్‌ను పెళ్శి చేసుకోమని బలవంతం పేట్టేవారంటా..దాంతో అది నచ్చని గదదర్ మయమైనట్లు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు తను సూరత్ లోని ఓ ప్రయివేట్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని అన్నారు. తను సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పటికీ తను ఇంకా బ్యాచిలరేనని అన్నారు. దాంతో నాకుటుంబాన్ని ఒక్కసారి చూడాలని అనిపించడంతో మరలా తిరిగి అందియా గ్రామానికి తిరిగి రావడం జరిగిందని అన్నారు.

ఈ సందర్బంలో గదదర్ మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు, మా పెద్దన్నయ్య చనిపోయారని తెలుసుకున్నాను. ఏది ఐతేనేం మిగిలిన మా అన్నయ్య కుటుంబ బాధ్యతలు నేను స్వీకరించాల్సి ఉందని అన్నారు. అంతేకాకుండా మా అన్నయ్య పిల్లలకు చదువులు, వారిబాగోగులు చూడాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. గదదర్‌ని చూచినటువంటి అతని స్నేహితులు కూడా చాలా ఆశ్చర్యానికి లోనుకావడం జరిగింది. ఈసందర్బంలో గదదర్ స్నేహితుడు ప్రమోద్ మాట్లాడుతూ ఈసారి గదదర్‌ని మాయమవ్వకుండా చూసుకుంటామని అన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X