పాన్ కార్డు అప్లయి చేసే సమయంలో ఈ తప్పులు చేయకండి

శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్ కార్డు) క‌లిగి ఉండ‌టం అంద‌రికీ అత్య‌వ‌స‌ర‌మ‌య్యే ప‌రిస్థితులు నేడు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల‌కు, పెట్టుబ‌డులు పెట్టేందుకు గుర్తింపు త‌నిఖీ కోసం పాన్ కార్డు వివ‌రాల‌ను అడుగుతు

|

శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్ కార్డు) క‌లిగి ఉండ‌టం అంద‌రికీ అత్య‌వ‌స‌ర‌మ‌య్యే ప‌రిస్థితులు నేడు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల‌కు, పెట్టుబ‌డులు పెట్టేందుకు గుర్తింపు త‌నిఖీ కోసం పాన్ కార్డు వివ‌రాల‌ను అడుగుతున్నారు. పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ లేదా పాన్‌కార్డ్‌(PAN card) అనేది సార్వత్రికమైన 10 అంకెల అల్ఫాన్యూమరిక్‌ గుర్తింపు కార్డు. ఆదాయ పన్ను శాఖ ప్రతీ ప‌న్ను చెల్లింపుదారుకు దీన్ని జారీ చేస్తుంది. బ్యాంకుల్లో 50 వేల పైబ‌డి డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు మ్యాన్యువ‌ల్‌గా ద‌ర‌ఖాస్తు చేసినా మీకు కార్డు రావ‌డానికి 15 నుంచి 20 రోజులు ప‌డుతుంది.

పాన్ కార్డు అప్లయి చేసే సమయంలో ఈ తప్పులు చేయకండి

ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వారు ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా రెండ్రోజుల్లో పాన్‌కార్డు పొందే స‌దుపాయాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది.ఈ శీర్షికలో భాగంగా పాన్ కార్డు అప్లయి చేసే సమయంలో చేయకూడని తప్పులను ఓ సారి తెలుసుకుందాం.

సూచన 1

సూచన 1

పాన్ కార్డ్ దరఖాస్తుపై మీ ఫోటోను పిన్ చేయకూడదు. అక్కడ కనిపించే బాక్స్‌లో మాత్రమే అతికించాలి.
పాన్ కార్డు దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు ఏవైనా తప్పులు రాస్తే వాటిని దిద్దకూడదు. కొత్త ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. సంతకాన్ని బాక్సులోనే చేయాలి. మీ సంతకం బాక్సు దాటి బయటకు వెళ్లకూడదు.

సూచన 2

సూచన 2

ఫోటోపైన సంతకం చేయకూడదు. ఫోటోపైన పెన్ను గీతలు, గుర్తులు ఉంటే మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశముంది. పూర్తి పేరు రాయడం మర్చిపోవద్దు. పేరును షార్ట్ కట్‌లో రాయొద్దు. తేదీ, హోదా లాంటి అనవసరమైన వివరాలు అసలు రాయవద్దు.

సూచన 3
 

సూచన 3

ఇప్పటికే మీ దగ్గర పాన్ కార్డు ఉంటే మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధం. అయితే అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. పాన్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు.

తండ్రి పేరు రాయాల్సిన చోట భార్య లేదా భర్త పేరు రాయకూడదు. మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పులు లేకుండా రాయాలి.

 

సూచన 3

సూచన 3

ధరఖాస్తు ఫామ్ పైన సంతకం చేయడం మర్చిపోవద్దు. సూచించిన చోట సంతకం చేయకపోతే దరఖాస్తును అనుమతించరు. మీ దరఖాస్తు ఫామ్‌ను మీ దగ్గర్లోని NSDL అడ్రస్‌కు పంపాలి.

ధర‌ఖాస్తు ఫారం పంపాల్సిన చిరునామా:

NSDL, 'Income Tax PAN Services Unit, National Securities Depository Limited, 3rd Floor, Sapphire Chambers, Near Banner Telephone Exchange, Banner, Pune - 411045 (Maharashtra)

ఇక ఎన్‌సీడీఎల్ నుంచి అధిక స‌మాచారం పొందేందుకు [email protected] ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయ‌వ‌చ్చు.
ఆఫ్‌లైన్‌లో స‌బ్‌మిట్ చేయాల‌నుకునేవారు ఇవి చూసుకోవాలి.

అక్నాలెడ్జ్‌మెంట్ ఫారం(క‌ల‌ర్ ఫోటో,సంత‌కం) వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌ చిరునామా గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌ ఆఫ్‌లైన్‌లో డ‌బ్బు చెల్లించేవారైతే రూ. 107 డీడీ.

 

 

48 గంట‌ల్లో పాన్ కార్డు పొంద‌డ‌మెలా ?

48 గంట‌ల్లో పాన్ కార్డు పొంద‌డ‌మెలా ?

పాన్ కార్డు గురించి పాన్‌కార్డు అనేది గుర్తింపు ప‌త్రంగా సైతం ప‌నిచేస్తుంది. భారత ఆదాయపు పన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. పేరు, వయసు, చిరునామా తదితర వివరాలతో కూడిన దరఖాస్తు పత్రాన్ని ఆదాయపు పన్ను శాఖకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత చాలాకాలం వరకు దరఖాస్తుదారులు వేచి చూడాలి. అత్యవసర సమయాల్లో పాన్‌కార్డుని రెండ్రోజుల్లో పొందడానికి ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ సహకార మందిస్తుంది. పాన్‌కు ద‌ర‌ఖాస్తు చేసేముందు మీ వ‌ద్ద రూ.107 డీడీ లేదా చెక్కు ఉండాలి. లేదా ఆన్‌లైన్‌లో పే చేయాల‌నుకుంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉంటే స‌రిపోతుంది.

వెబ్‌సైట్‌కి లాగిన్‌

ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌కి లాగిన్‌ కావాలి ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ని సందర్శించాలంటే ఎన్‌ఎస్‌డిఎల్‌. కో. ఇన్‌ కి లాగిన్‌ కావాలి. ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ లో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కావాలంటే ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఫారం నింపాలి. డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ చేయాలి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కోసం ఆన్‌లైన్ ఫారంలో వార్డు లేదా స‌ర్కిల్‌, రేంజి, క‌మీష‌న‌ర్‌, ఏరియా కోడ్‌, ఏవో కోడ్‌, రేంజ్ కోడ్‌, ఏవో నంబ‌రు వంటివ‌న్నీ పూరించాలి.

ఫామ్‌ ఎంచుకోవాలి:

గైడ్‌లైన్స్‌ చదివిన తర్వాత ఫామ్‌ రకాన్ని ఎంచుకో వాలి. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ కావాలా? డిజిటల్‌ సిగ్నేచర్‌ లేని సర్టిఫికేట్‌ కావాలా? అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. వివరాలు మొత్తం నింపాలి. పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో లభ్యమౌతాయి. పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్ డేటాలో మార్పు, చేర్పులు చేసుకోవడం కూడా ఎన్ఎస్డిఎల్ ద్వారా సాధ్యమౌతుంది.

ఎలా సమర్పించాలి?

వివరాలన్నీ నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఫామ్‌ సమర్పిం చాలి. ఆఫ్‌లైన్‌లో సమర్పించాలనుకుంటే ఎన్‌ఎస్‌డిఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫామ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫామ్‌లో నింపిన ప్రకారం సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌ జత చేసి సమర్పించాలి.

అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్, రెండు రోజుల్లో

అప్లికేషన్‌ నెంబర్‌ ప్రకారం ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. ఈ నెంబర్‌ ప్రకారమే మీ అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేసుకోవచ్చు. సర్వసాధారణంగా అయితే 15 నుంచి 20 వర్కింగ్‌ డేస్‌ తర్వాత పాన్‌ కార్డు వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. కేవలం రెండు రోజుల్లో పాన్‌కార్డు పొందవచ్చు. వివరాలన్నీ సమర్పించిన తర్వాత రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా పాన్‌కార్డు వస్తుంది.

 

Best Mobiles in India

English summary
Applying for PAN card offline and online Avoid these mistakes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X