మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వల్ల వోడాపోన్‌కి లాభం, రిలయన్స్‌కి నష్టం..

Posted By: Super

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వల్ల వోడాపోన్‌కి లాభం, రిలయన్స్‌కి నష్టం..

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారతదేశంలో టెలికాం రంగంలో ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం మొబైల్ నెంబర్ పోర్టబులిటీ. మొట్టమొదట నవంబర్‌‌లో నార్త్ ఇండియాలో నవంబర్‌లో ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం మొత్తం జనవరి 20వ తారీఖున దీనిని ప్రవేశపెట్టారు. శుక్రవారం సెల్యులర్ ఆసోషియేషన్ ఆప్ ఇండియా(COAI)వారు చూపించినటువంటి డేటా ప్రకారం ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీలో భారతదేశంలో ఉన్నటువంటి వోడాఫోన్ వారు ఎక్కువ మంది కస్టమర్స్‌ని తమవైపు తిప్పుకోవడం జరిగిందన్నారు.

భారతదేశంలో మూడవ స్దానంలో ఉన్నటువంటి వోడాఫోన్ ఏసర్ కంపెనీ అత్యధికంగా 1,92, 761 కస్టమర్స్‌ని తమవైపుకి తిప్పుకున్నారు. ఇక ఆరవ స్దానంలో ఉన్నటువంటి ఐడియా కంపెనీ 1,50,789 కస్టమర్స్‌ని తమవైపుకి తిప్పుకోవడం జరిగింది. ఇక భారతదేశంలో నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ అయినటువంటి భారతీ ఎయిర్ టెల్ కేవలం 148215 కస్టమర్స్‌ని మాత్రమే తమవైపుకి ఆకర్షించ గలిగింది. ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం రిలయన్స్ మొబైల్.

భారతదేశంలో రెండవ స్దానంలో ఉన్నటువంటి రిలయన్స్ మొబైల్ ఈ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ వల్ల 306417 మొబైల్ కస్టమర్స్‌ని కోల్పోయారు. గత సంవత్సరం నుండి మొబైల్ సర్వీసెస్ గురంచి మాట్లాడుకుంటే యావరేజిగా నెలకు 19మిలియన్స్ భారతీయులు కొత్త నెంబర్స్ తీసుకున్నట్లు సమాచారం. జనవరి వరకు యావత్ భారదేశంలో 771మిలియన్ జనాభా మొబైల్ వినియోగదారులున్నట్లు సమాచారం. ఇండియా ప్రపంచంలో కెల్లా రెండవ అతి పెద్ద మొబైల్ సర్వీస్ మార్కెట్ అని డేటా ప్రకారం చెబుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot