Mobile Data Vs Broadband: ఇంటి నుండి పనిచేసే వారికి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఉత్తమమైనది ఏది?

|

ఇండియాలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించింది. అయితే అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయమని ఆదేశాలను జారీచేసాయి. మూడు నెలలు లాక్ డౌన్ తరువాత ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ ను ఎత్తివేసింది. కానీ చాలా వరకు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఇప్పటికి ఇంటి వద్ద నుండి మాత్రమే తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాను మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను వినియోగిస్తున్నారు. ఇందులో ఏ కనెక్షన్ ను ఎంచుకోవడం ఉత్తమం అన్న విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్

ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్

ఇండియాలోని ప్రైవేట్ టెక్ సంస్థలు ఇప్పటికి తమ యొక్క ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పని చేయమని ఆదేశాలను జారీచేస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాలలో ఆఫీసులను కలిగి ఉండడం వలన ఆఫీసులలో ఇంటర్నెట్ సమస్యలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అందరూ లాక్ డౌన్ మొదలైన తరువాత వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిన వారు చాలానే ఉంటారు. వీరు ఇంటర్నెట్ కోసం వారి ప్రాంతాలలో లభించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను వాడుతూ ఉంటారు లేదా మొబైల్ డేటాను ఉపయోగిస్తూ ఉంటారు.

 

Also Read: ఈ రెడ్‌మి ఫోన్‌లను వాడుతున్నారా!!! అయితే MIUI 12 అప్‌డేట్‌ పొందడం కష్టమేAlso Read: ఈ రెడ్‌మి ఫోన్‌లను వాడుతున్నారా!!! అయితే MIUI 12 అప్‌డేట్‌ పొందడం కష్టమే

ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను ఎంచుకోవడం

ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను ఎంచుకోవడం

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అనేది ఇప్పుడు దేశంలో అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇవి ఇంకా అందుబాటులో లేవు. బ్రాడ్‌బ్యాండ్ యొక్క ప్లాన్లు 10Mbps స్పీడ్ నుంచి మొదలయి 300Mbps వరకు అందుబాటులో ఉన్నాయి. 10Mbps స్పీడ్ వద్ద లభించే ప్లాన్లు తక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. కానీ ఇందులో డేటా తక్కువగా లభించే అవకాశం ఉంది. ఎక్కువ స్పీడ్ తో లభించే ప్లాన్లు ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను ఎంచుకునేటప్పుడు మొదట రౌటర్ మరియు ఇన్స్టాలేషన్ చార్జీలు కూడా చెల్లించవలసి ఉంటుంది. ప్రైవేట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఎక్కువ ఆఫర్లను అందిస్తున్నప్పటికీ ఇవి చిన్న చిన్న పట్టణాలు మరియు పల్లె ప్రాంతాలలో మాత్రం అందుబాటులో లేవు.

ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాను ఎంచుకోవడం

ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాను ఎంచుకోవడం

ప్రసుత సమయంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను ఖచ్చితంగా వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రవైట్ సంస్థలలో పనిచేసే వారు తమ సహాఉద్యోగులతో మాట్లాడడానికి మరియు ఆఫీస్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్ నెంబర్ ను యాక్టీవ్ లో ఉంచడానికి రీఛార్జ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు తక్కువ ధరలోనే అధిక రోజువారి డేటాను అందిస్తూ ఉన్నాయి. అన్ని సంస్థలు రోజుకు 2/3/4GB డేటాను కూడా అందిస్తున్నాయి. వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లలో హాట్ స్పాట్ ఆన్ చేసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా ఆఫీస్ కార్యకలాపాలను చేయవచ్చు.

మొబైల్ డేటా vs బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్

మొబైల్ డేటా vs బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్

ఇంటి వద్ద నుండి పనిచేసే వారు ఎవరైనా సరే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను తీసుకున్నప్పటికి ఫోన్ కాల్స్ తీసుకోవడానికి మరియు వాట్సాప్ వంటి మరిన్ని సోషల్ మీడియా యాప్ లను ప్రతి నిమిషం వాడటానికి తమ ఫోన్ నెంబరును ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు వోడాఫోన్ సిమ్ వాడుతుంటే కనుక రూ.399 మరియు రూ.450 ధర వద్ద లభించే ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు రోజుకు 3GB డేటా 58రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. యూజర్లు తమ ఆఫీస్ కార్యకలాపాలు చేయడానికి రోజుకు ఈ మాత్రం డేటా సరిపోతుంది కావున అధిక మొత్తంలో లభించే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను పొందడం కంటే మొబైల్ డేటాను అధిక రోజువారి డేటా ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకోవడం ఉత్మమం.

Best Mobiles in India

English summary
Mobile Data Vs Broadband : Which Internet Connection is Best For Working From Home?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X