లక్ష కోట్లు దాటిన లావాదేవీలు, కార్డులపై తగ్గిన మోజు
దేశంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరి
దేశంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. అదే క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైంది.

ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి.

యూపీఐ యాప్స్
యుపిఐ యాప్ లు సరికొత్తగా ముందుకు వెళుతున్నాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్ డిస్కౌంట్లు, స్క్రాచ్ కార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం
ఏడాది క్రితం పేమెంట్ గేట్‌వేస్ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్ మాథుర్ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్ పేమెంట్స్ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది.

డిజిటల్‌దే అగ్రభాగమంటున్న ఆర్‌బిఐ
తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019- 2021ను ఆర్‌బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి డిజిటల్ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయని అంచనా వేసింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్‌బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుందిని ఈ సందర్భంగా తెలిపింది.

ఆన్ లైన్ ఆర్ధిక నేరాలు
ఆన్ లైన్ ఆర్ధిక వ్యవహరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే అంతే స్పిడుగా ఆన్ లైన్ ఆర్ధిక నేరాలు పెరుగుతున్నాయి..ఆన్ లైన్ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు..ఇదే విషయాన్ని గమనించి ఆర్బిఐ పలు ఆన్ లైన్ సర్వీసు సంస్థలను హెచ్చరించింది. ముఖ్యంగా ఎని డెస్క్ ఆప్ ద్వార మోసాలు జరుగుతున్నట్టు ఆర్బిఐ గుర్తించింది.

ఎని డెస్క్ యాప్
ఎని డెస్క్ యాప్ ద్వారా దుండగులు వారి ఫోన్లను తమ ఆదీనంలోకి తీసుకుని ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారని ఆర్బిఐ సైబర్ భద్రత,మరియు ఐటి పరిశోధన విభాగం ఓక ప్రకటన విడుదల చేసింది...దీంతోపాటు యూపిఐ,మొబైట్ వ్యాలేట్స్ మరియు బ్యాంకింగ్ ఆప్ ద్వార కూడా మోసాలు...జరుగుతున్నట్టు నెషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్త
మొబైల్‌లో కాంటాక్ట్‌లతోపాటు బ్యాంక్ ఖాతాలు, డెబిట్‌కార్డ్ నెంబర్లు, వాటి పాస్‌వర్డ్‌లను ఎక్కువ మంది నమోదు చేస్తుంటారు. ట్రూకాలర్ వంటి కాంటాక్ట్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు దాదాపు అన్ని యాప్‌లు కాంటాక్ట్‌లకు అనుసంధానమయ్యేందుకు మన దగ్గర అనుమతి పొందుతాయి. అందువల్ల అనుమానాస్పద యాప్‌ల వల్ల ఈ సమాచారం అంతా సులభంగా అక్రమార్కులకు చేరే వీలుంది. వ్యక్తిగతంగా, రహస్యంగా చిత్రీకరించుకున్నామనే భ్రమల్లో సెల్ఫీలు, అవాంఛనీయ చిత్రాలు, వీడియోలను కొందరు తీసుకుంటున్నారు. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications








