4 జిబి డేటా 3000 రూపాయలు ఎక్కడో తెలుసా?
ఈ స్మార్ట్ ఫోన్ కాలం లో మొబైల్ ఇంటర్నెట్ అనేది ప్రాధమిక అవసరాలలో ఒకటి ఎందుకంటే ఏదైనా సమాచారం అందిచడంలో ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగపడుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ కాలం లో మొబైల్ ఇంటర్నెట్ అనేది ప్రాధమిక అవసరాలలో ఒకటి ఎందుకంటే ఏదైనా సమాచారం అందిచడంలో ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రపంచం లో చాలా దేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు అంటే నమ్మగలరా?అవును అలాంటి దేశాలు ఈ ప్రపంచం లో చాలా ఉన్నాయి.వారికి ఇంటర్నెట్ అనేది చాలా విలాసంతవమైన ప్రాప్తి.అలాంటి దేశాలలో క్యూబా కూడా ఒకటి. ఈ నేపథ్యం లో ఎంతో వెనకబడ్డ కరేబియన్ ద్వీపం యొక్క క్యూబా దేశంలోని ప్రజలకు ఆ దేశ గవర్నమెంట్ మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించబోతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే......

మొదట న్యూస్ ఏజెన్సీలు మరియు రాయబార కార్యాలయాల ఉద్యోగులుకు
మొదటగా క్యూబా దేశం లోని న్యూస్ ఏజెన్సీలకు మరియు రాయబార కార్యాలయ ఉద్యోగులకు మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ సంవత్సరం చివరికి దేశం లోని ప్రజలందిరికి మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే విధంగా క్యూబా దేశ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది.

నెలకు $45(రూ.3000)
క్యూబా టెలికాం దిగ్గజం ETECSA కు ఆ దేశంలో గుప్తాదిపత్యం ఉన్నపటికీ దీనికి సంబదించిన విషయం గురించి ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు . అయితే క్యూబా టెలికాం కంపెనీ సంస్థలు 4జిబి డేటా కోసం $45(రూ.3000) ఛార్జ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది .ఈ నేపథ్యంలో 2018 చివరి నాటికి 5 మిలియన్ వినియోగదారులకు అంటే ఆ దేశ సగం జనాభాకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రిపోర్ట్స్ వెలువడ్డాయి.

గతంలో టూరిస్ట్ హోటళ్లకు మాత్రమే ఇంటర్నెట్ పరిమితం
గతం లో ఇంటర్నెట్ సౌకర్యం టూరిస్ట్ హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యేది . అయితే క్యూబా దేశ గవర్నమెంట్ మాత్రం అక్కడి ప్రజల కోసం సైబర్ కేఫ్ మరియు పబ్లిక్ వైఫై హాట్ స్పాట్స్ ను ప్రవేశపెట్టింది. అక్కడ సైబర్ కేఫ్ నిర్వాహకులు ఒక గంటకు $1(రూ. 69) వసూలు చేసేవారు.

2020 సంవత్సరం నాటికి
2020 సంవత్సరం నాటికి క్యూబా దేశం లోని సగం గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేలా ఆ దేశ గవర్నమెంట్ ప్ల్యాన్ చేస్తుంది.కాగా ఇప్పటివరకు టెలికాం ఆపరేటర్లు దేశం లోని 11,000 ఇళ్లకు వెళ్లి కలుసుకునట్టు ETECSA ప్రెసిడెంట్ Mayra Arevich లోకల్ మీడియా ఛానల్ కు తెలిపారు.


Click it and Unblock the Notifications








