మొబైల్‌లో ఎక్కువ సమయం సోషల్‌నెట్ వర్కింగ్ వెబ్‌సైట్సే పైనే

Posted By: Staff

మొబైల్‌లో ఎక్కువ సమయం సోషల్‌నెట్ వర్కింగ్ వెబ్‌సైట్సే పైనే

దేశంలో ప్రస్తుతం 4.70 కోట్ల వినియోగదారులుండగా, ఇందులో మొబైల్‌ ద్వారా ఇంటర్నేట్‌ సేవలు పొందుతున్న వారు 1.18 కోట్లుగా ఉన్నారని నీల్సన్‌ సర్వేలో తేలిందని నోకియా ప్రకటించింది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో అత్యధికులు బ్రౌజింగ్‌కే మొగ్గుచూపుతున్నారని నోకియా-నీల్సన్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానం ఈ-మెయిల్/చాటింగ్‌ది కాగా మూడో స్థానం సోషల్ నెట్‌వర్కింగ్ దక్కించుకుందని నోకియా సర్వీసెస్ మార్కెటింగ్ హెడ్ జస్మీత్ గాంధీ తెలిపారు. బుధవారమిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌తో సహా ఎనిమిది నగరాల్లో రూ.6 వేలలోపు ధర ఉన్న వివిధ కంపెనీల మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్న 2,734 మంది కస్టమర్లపై సర్వే చేపట్టినట్టు చెప్పారు.

హ్యాండ్‌సెట్లకు సంబంధించి బ్రాండ్, స్క్రీన్ రిజల్యూషన్, కెమెరా తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవాటికే కస్టమర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా సర్వేలో తేలిందన్నారు. వెబ్‌సైట్ బ్రౌజింగ్‌లో యాహూ తొలిస్థానం ఆక్రమించగా, ఫేస్‌బుక్, జీమెయిల్, గూగుల్, ఆర్కుట్, ట్విట్టర్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సర్వే ప్రకారం ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్‌లో 82 శాతం మంది కస్టమర్లు నోకియా పేరును సిఫార్సు చేశారని జస్మీత్ తెలిపారు. మార్కెట్ వాటా పెంచుకునేందుకు జీపీఆర్‌ఎస్ సౌకర్యం ఉన్న మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి తేనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో సుమారు 1.18 కోట్లమంది వినియోగదారులు మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot